కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్య ప్రజానీకం నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడకుండా పలువురు దాతలు పేదలకు నిత్యావసర సరుకులు పంచారు. విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా విరాళాలు వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గల పేదలకు ఇంటికి ఐదు కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, పసుపు, కారం, నూనె ఇతర వస్తువులు అందించారు.
ఇవీ చూడండి: షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం, తల్లీకుమార్తె సజీవదహనం