కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికలో ( Huzurabad by elections )భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెరాస ఆరోపించింది. ఈ మేరకు ఈటలపై తెరాస నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈటల రాజేందర్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని.. విమర్శలు చేశారని తెరాస అభ్యంతరం వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని, పోలింగ్ ప్రశాంతంగా సాగేలా చూడాలని ఈసీని తెరాస కోరింది.
ఈ ఉదయం 7 గంటల నుంచి హుజూరాబాద్ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్‌లో ( Huzurabad by elections 2021) చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల తెరాస-భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. గొడవలు పెద్దవి కాకుండా పోలీసులు పరిస్థితులను అదుపు చేశారు. మూడు గంటల వరకు 61.66 శాతం పోలింగ్ నమోదయింది.
ఉపఎన్నికల పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా.. కట్టడి చేసేందుకు తమ వద్ద తగిన పోలీస్ బలగాలు ఉన్నాయని తెలిపారు.
ఇదీచూడండి: