cargo services: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్గో సేవలు టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్‌కి 83 కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చాయని కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ అన్నారు. కరీంనగర్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
'ఆర్టీసీ కార్గో వాహనాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు వారికి సామాన్లను సమయానికి అందిస్తున్నాము. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మేడారం జాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ భక్తులకు టీఎస్ ఆర్టీసీ కార్గో మంచి సదావకాశాన్ని కల్పిస్తుంది. భక్తులు దానిని వినియోగించుకోవాలి. అమ్మవార్లకు సమర్పించే బంగారమైన బెల్లాన్ని 5 కిలోల వరకు సమ్మక్క గద్దెల వరకు చేరవేసి అయ్యవార్లకు అందించి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తుంది. తిరిగి 200 గ్రాముల అమ్మవారి బంగారాన్ని భక్తులకు చేరే విధంగా విధి విధానాలు చేపట్టాము. జాతరకి కొన్ని కారణాల వల్ల వెళ్లలేని భక్తులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము. రాష్ట్ర ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలి.'
- కృష్ణకాంత్, టీఎస్ ఆర్టీసీ కార్గో స్పెషల్ ఆఫీసర్
ఇదీ చదవండి: RTC Reduces Bus Fare: ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం..