ఒకరి అవసరం మరొకరికి ఆసరా అన్నట్లుగా కరీంనగర్‌లోని వడ్డీ వ్యాపారులు వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజల అవసరాన్ని బట్టి 5 నుంచి 15 శాతం వరకూ వడ్డీని వసూలు చేస్తున్నట్లు విచారణలో తేల్చారు. వడ్డీ వ్యాపారస్థుల ఇళ్లు, కార్యాలయాలపై 37 చోట్ల పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 11 మంది వడ్డీ వ్యాపారుల నుంచి 52.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.
కొందరు వడ్డీ వ్యాపారులుతే మరింత ముందుకు వెళ్లి ఇంటికి సంబంధించి పూర్తిస్థాయిలో హక్కులు ఉండేలా తమ పేరున అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. విధి లేక సదరు ఇంటి యజమాని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి అయ్యే ఖర్చులను కూడా భరించాల్సి వస్తుంది. చెల్లించకపోతే ఆ ఆస్థి వారిపేరుపైకి బదిలీ అయ్యేలా ఒప్పందం రాసుకుంటున్నట్లు గుర్తించారు. వడ్డీ వ్యాపారంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండటం సైతం విశేషం.
ఇదీ చూడండి: