జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. జగిత్యాల టవర్ సర్కిల్లో రోడ్లపై వరద నీరు చేరింది. ఫలితంగా రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
ధరూర్ రోడ్డు, హనుమాన్వాడ, పోచమ్మవాడల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. రాయికల్, సారంగాపూర్ , బీర్పూర్, మల్యాల, కోరుట్ల మండలాల్లోనూ వాన దంచికొట్టింది.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో వరద మిగిల్చిన నష్టాలు తీరేదెలా?