ETV Bharat / city

YS Sharmila Hunger strike : నేడు వైఎస్‌ షర్మిల రైతు వేదన నిరాహార దీక్ష

YS Sharmila Hunger strike
YS Sharmila Hunger strike
author img

By

Published : Nov 13, 2021, 6:36 AM IST

Updated : Nov 13, 2021, 6:56 AM IST

06:10 November 13

72 గంటల పాటు వైఎస్ షర్మిల దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement in Telangana) చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YSRTP founder YS Sharmila) దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు  చేపట్టనున్న దీక్షలో..హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. మిగతా 48 గంటలు లోటస్ పాండ్​లోని పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగించనున్నారు. రైతులకు అండగా(YSRTP supports farmers) ఉండేందుకు షర్మిల(YSRTP founder YS Sharmila) ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. 

కేంద్రానికి వ్యతిరేకంగా తెరాస ధర్నా..

ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు(Paddy procurement in Telangana)పై ఇటు అధికార తెరాస, అటు భాజపాలు ధర్నాలు చేశాయి. రైతుల పట్ల కేంద్ర విధానాలు నిరసిస్తూ ఈనెల 12న తెరాస రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు(TRS dharna over paddy procurement) దిగింది. ఈ ధర్నాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీఏ సర్కార్ కర్షకుల పట్ల అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే.. రైతులు ఏం చేయాలని? పండించిన పంటంతా ఏమవ్వాలని తెరాస మంత్రులు ప్రశ్నించారు. దేశమంతా వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రసర్కార్​కు వ్యతిరేకంగా భాజపా ఆందోళన..

మరోవైపు.. ఈనెల 11న రాష్ట్ర సర్కార్​కు వ్యతిరేకంగా భాజపా ధర్నాకు(BJP dharna over paddy procurement) దిగింది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై నెపం నెడుతోందని భాజపా ఆరోపించింది. రైతుల పట్ల కేసీఆర్ నిరంకుశ విధానాన్ని అమలు చేస్తున్నారని మండిపడింది. వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేసింది.

Last Updated : Nov 13, 2021, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.