ETV Bharat / city

వైఎస్​ నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

ప్రాంతాలకు.. కులాలకు అతీతంగా అందరిని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రేమించారని వైఎస్​ షర్మిల అన్నారు. ప్రతి రైతు రాజు కావాలనుకున్నారని... ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు ఉచితంగా చదువుకోవాలనుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

ys sharmila
ys sharmila
author img

By

Published : Feb 20, 2021, 1:56 PM IST

Updated : Feb 20, 2021, 2:21 PM IST

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమని వైఎస్​ షర్మిల పునరుద్ఘాటించారు. వైఎస్సార్​ కులమతాలకతీతంగా పాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. లోటస్‌పాండ్‌లో రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న షర్మిల... జై తెలంగాణ... జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. పేదలు, రైతులు, విద్యార్థులకు ఉపయోగపడేలా వైఎస్సార్​ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని... ప్రజల ఆశీర్వాదంతో నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామన్నారు.

వైఎస్​ నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం: షర్మిల

వైఎస్సార్​ ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని షర్మిల పునరుద్ఘాటించారు. అందుకే మహానేత మరణించినప్పుడు ప్రాణాలొదిలేసిన వాళ్లలో తెలంగాణ వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ అభిమానుల నుంచి పలు అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పేపర్లను ఇచ్చి సమాధానాలను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్​ బిడ్డగా... రాజకీయ నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు... జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉన్న అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

వైఎస్ అభిమానుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న అంశాలివే!

1.రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్​ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటి... వాటిని ఏవిధంగా తీర్చుకోవాలి.

2. మీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో వైఎస్సార్ చేసిన పనులు ఏంటి?

3. మనం తీసుకున్న రాజకీయ నిర్ణయం గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు?

4. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, తెరాసను మనం ఎలా ఎదుర్కోవాలి.. మీరిచ్చే సలహాలు ఏంటి?

5. రాష్ట్రంలో ఉన్న భాజపాని మనం ఏవిధంగా ఎదుర్కోవాలి.. మీరిచ్చే సలహాలు ఏంటి?

6. తెలంగాణ సమాజం, ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏంటి..వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి..?

7.రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే...రాష్ట్ర స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏంటి?

8. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే జిల్లా స్థాయిలో పోరాడాల్సిన అంశాలేంటి?

ఇదీ చదవండి: తెలంగాణకు రూ.1940.95 కోట్ల జీఎస్టీ పరిహారం

Last Updated : Feb 20, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.