Councilor Attack: ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో పాల వ్యాపారం చేసుకునే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వైకాపా కౌన్సిలర్ దాడి చేశాడు. గత కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్... నిన్న సాయంత్రం గొడవకు దిగాడు. 'చెప్పినట్టు వింటే సరేసరి... లేకపోతే.. పాల బూత్ ఖాళీ చేయిస్తా'నని బెదిరింపులకు దిగాడు. ఎందుకని ప్రశ్నించినందుకు ఘర్షణకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఇరువురిని పోలీసులు ఠాణాకు తరలించారు. ఆ తర్వాత కౌన్సిలర్ భార్య, కుమారుడు షాపులో ఉన్న తన భర్త, కుమారుడిపై దాడి చేశారని బాధిత మహిళ వాపోయింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్నా.. తమకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి:
- తెదేపాలో చేరిన 2వేల మంది వైకాపా మద్దతుదారులు
- Temple to Mother: వెలకట్టలేని ప్రేమ 'అమ్మ దేవస్థానం'
- తొలిసారి కొడుకు ఫొటోలు షేర్ చేసిన కాజల్