ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్యను కర్నూలు నగర 3వ పట్ణణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ తబ్రేజ్ కథనం ప్రకారం.. ఓ మెస్‌లో సూపర్ వైజర్‌గా పని చేస్తున్న రామానాయుడుకు 17 ఏళ్ల క్రితం నిర్మలతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. రామానాయుడు తాగుడుకు బానిసై నిత్యం నిర్మలను వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే... తను ఉద్యోగం చేస్తున్న ఓ సంస్థలో సహోద్యోగి హేమకిశోర్ బాబుకు ఆమె దగ్గరైంది. విషయం కొంత కాలానికి రామానాయుడికు తెలిసింది.
భర్తను అంతమొందించాలని నిర్మల ప్రియుడితో కలిసి పథకం పన్నింది. గత నెల మార్చి 22న నిద్రమాత్రలు కలిపిన పాయసాన్ని భర్తకు తినిపించి. ప్రియుడు, మరో ఇద్దరి స్నేహితుల సహయంతో రామనాయుడిని గొంతు నులిమి చంపేసింది. మృతదేహాన్ని నగర సమీపంలోని దిన్నెదేవరపాడు వద్ద రోడ్డుపై పడేశారు. శవంపై ఆటో ఉంచి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఇంతా చేసి ఏమీ తెలియనట్టు నిర్మల.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వ్యవహారం బయటపడింది. నిందితులైన నిర్మల, హేమ కిశోర్ బాబు, విజయ్, రాకేష్ నేరం అంగీకరిచారు. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: పదో తరగతి విద్యార్థి దారుణ హత్య