ETV Bharat / city

'వైకాపా​ వైఫల్యాలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం' - తెదేపా ఎంపీలు వార్తలు

ఏపీలోని సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెదేపా ఎంపీలు తెలిపారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు... వైకాపా సర్కార్​పై ధ్వజమెత్తారు.

we-will-address-ycp-governments-failures-in-parliament-tdp-mps-said
'వైకాపా సర్కార్​ వైఫల్యాలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'
author img

By

Published : Jan 28, 2021, 7:24 PM IST

'వైకాపా సర్కార్​ వైఫల్యాలను పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం'

ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామని చెప్పిన వైకాపా... ఇప్పుడు నోరు ఎందుకు మెదపడం లేదని ఆంధ్రప్రదేశ్​కు చెందిన తెలుగుదేశం ఎంపీలు నిలదీశారు. గురువారం చంద్రబాబు నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు... వైకాపా సర్కార్​పై మండిపడ్డారు.

'జగన్ కేసుల గురించి తప్ప.. వైకాపా ఎంపీలకు దిల్లీలో ఏమి పట్టడం లేదు. స్కాం ఆంధ్రప్రదేశ్​పై పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. వైకాపా నాయకులు కేంద్ర నిధులను దారిమళ్లిస్తున్నారు. సీఎం ఎందుకు దిల్లీ వెళ్తున్నారో కూడా చెప్పడం లేదు. ప్రభుత్వ గోప్యతపై పార్లమెంట్​లోనూ ప్రశ్నిస్తాం. పోలవరం నిధులు ఆగిపోవడానికి కారణాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, మత మార్పిడీలపైనా పార్లమెంట్​లో ప్రస్తావిస్తాం' అని తెదేపా ఎంపీలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: రైతుల సంతోషంతోనే రాష్ట్రం సుభిక్షం: సభాపతి పోచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.