ETV Bharat / city

రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య.. నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు - vehicle registrations stopped

ఏపీలో రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య కారణంగా... ఆ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు.

ఏపీ రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య.. నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు

author img

By

Published : Dec 30, 2021, 11:00 PM IST

ఏపీలో రవాణాశాఖ వెబ్​సైట్​లో సాంకేతిక సమస్య కారణంగా... ఆ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల నూతన వాహనాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్​ ఛార్జీలు పెరగనున్నాయి. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నాలు చేస్తుండటంతో వెబ్​సైట్​పై ఒత్తిడిపెరిగి సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

వాహనం డెలివరీ చేయకపోవడం వల్ల పలు చోట్ల డీలర్లతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ ఉన్నతాధికారులు.. శుక్రవారం నాటికి వెబ్​సైట్​లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని తెలిపారు.

ఇదీచదవండి:

TSRTC Good news: పిల్లలు, తల్లిదండ్రులకు ఆర్టీసీ న్యూఇయర్​ బంపర్​ ఆఫర్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.