తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి గాంచిన వికారాబాద్ అనంతగిరులు పచ్చదనాన్ని అలుముకున్నాయి. కొత్త అందాలు చూసేందుకు... నగర నలుమూలల నుంచి వారాంతాల్లో వందల మంది పర్యటకులు తరలివస్తున్నారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరి.. తిరుగు ప్రయాణంలో ఆలూరు వద్ద రహదారిపై తక్కువ ధరలకే స్థానిక రైతులు విక్రయించే తాజా కూరగాయలు, ఆకుకూరలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఆలూరు వద్ద నిత్యం కూరగాయల కొనుగోళ్లతో రద్దీగా ఉంటుంది. అయితే హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి కావడం వల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. వాహనాలను రహదారి పక్కన నిలిపే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే విహారయాత్ర విషాదంగా మారకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం