ETV Bharat / city

రైస్‌ మిల్లుల్లో తనిఖీలు చేపట్టండి: కిషన్​ రెడ్డి

Kishan Reddy: తెలంగాణలోని రైస్‌ మిల్లుల్లో ధాన్యం బస్తాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా అన్నింటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎఫ్​సీఐ అధికారులను ఆదేశిస్తూ లేఖ రాసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 40 మిల్లుల్లో 18,155 టన్నుల ధాన్యం మాయమైనట్టు వెల్లడైందన్నారు. ఆ ధాన్యం ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

author img

By

Published : Apr 21, 2022, 5:53 AM IST

kishan reddy
kishan reddy

Kishan Reddy: రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో ధాన్యం బస్తాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా అన్నింటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులను ఆదేశిస్తూ లేఖ రాసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఎఫ్‌సీఐ అధికారులు మార్చి 30 నాటికి రాష్ట్రంలోని 40 మిల్లులను తనిఖీచేయగా 4,53,896 బస్తాల (18,155 టన్నులు) ధాన్యం తక్కువగా ఉన్నట్టు తేలిందన్నారు. ఆయా మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2020-21 యాసంగి పంట కాలంలో సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యానికి సంబంధించి 21 మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీచేయగా 1,96,177 బస్తాలు, 2021-22 వానాకాలం పంటకు సంబంధించి 19 మిల్లుల్లో తనిఖీచేయగా 2,57,719 బస్తాల ధాన్యం లెక్కల్లోకి రాలేదు. వాస్తవంగా రాష్ట్రంలోని 3,278 మిల్లుల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా, 2,320 మిల్లులో లెక్కించడానికి వీలులేకుండా ధాన్యం రాశులుగా పోసి ఉండటంతో వీలు కాలేదు. మాయమైన ధాన్యం ఎక్కడికి పోయింది? ఎవరిని మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని’ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సదరు ధాన్యాన్ని ఈ సీజన్‌లో ఇస్తారా, వచ్చే సీజన్‌లో ఇస్తారా అనేది తేల్చాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం మాయంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఓ పార్టీ నేత (రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే లేదా కోర్టులు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు చేయించవచ్చన్నారు.

దీక్షల పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం: బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వంతో లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కనపెట్టి, రైతు దీక్షల పేరుతో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దీక్షల పేరుతో కొనుగోళ్లను ఆలస్యం చేయడంతో మద్దతు ధర కన్నా తక్కువకు ధాన్యం అమ్ముకుని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న లేఖ రాసిందని, అందుకు అంగీకారం తెలుపుతూ 18వ తేదీన కేంద్రం లేఖ పంపిందని గుర్తుచేశారు. 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుచేసి నిల్వ చేసేందుకు దాదాపు 15 కోట్ల గోనె సంచులు అవసరమని, ఇప్పటివరకు వాటి సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టలేదని ఆరోపించారు. గోతాలు లేకుండా ధాన్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ తట్టలతో ధాన్యాన్ని సేకరిస్తారా? అని ప్రశ్నించారు.

2,320 మిల్లుల్లో తనిఖీలు చేస్తాం: ‘‘రాష్ట్రంలోని 2,320 రైస్‌ మిల్లులో ధాన్యం నిల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి సంయుక్త తనిఖీ చేయాలని నిర్ణయించాం. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని మిల్లర్లను ఆదేశించండి. లేనిపక్షంలో ఆ మిల్లుల నుంచి బియ్యాన్ని తీసుకునేది లేదు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) తెలంగాణ విభాగం బుధవారం లేఖ రాసింది. బియ్యం ఇవ్వాల్సిన గడువు పొడిగింపు నేపథ్యంలో మిల్లులోని ధాన్యం నిల్వలను పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేస్తామని గతంలోనూ ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఆ మేరకు సోదాలు జరిపిన 40 మిల్లుల్లోనే సుమారు 18,155 టన్నుల ధాన్యం నిల్వలు మాయం అయినట్లు గుర్తించింది. అదే విషయాన్ని చెబుతూ మిల్లుల వివరాలతో సహా పౌరసరఫరాల శాఖకు తాజాగా లేఖ రాసింది. ‘‘గతంలో లెక్కింపునకు సహకరించని 2,320 మిల్లుల్లో ఈ నెల 28వ తేదీ నుంచి సంయుక్త తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాం. తనిఖీలకు సహకరించాలని ఇప్పటికే పలు దఫాలు లేఖలు రాసినా పౌరసరఫరాల శాఖ నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా తనిఖీలకు వీలు కల్పించని పక్షంలో ఆ మిల్లుల నుంచి బియ్యం తీసుకునేది లేదని’ ఆ లేఖలో ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:పొరుగు రాష్ట్రాల్లో అంకుర ఆస్పత్రుల శాఖలు.. ప్రకటించిన బ్రాండ్​అంబాసిడర్​ సోనూసూద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.