ETV Bharat / city

Kishan Reddy on TRS Govt: 'రూపాయికి కిలో బియ్యం పథకం రద్దు చేస్తున్నారా..?' - తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​

Kishan Reddy on TRS Govt: ధాన్యం, బియ్యం కొనుగోళ్లపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాక.. మళ్లీ ఇప్పుడు పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం.. ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయి కిలో బియ్యం రద్దు చేయడమేనంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Kishan Reddy on TRS Government
Kishan Reddy
author img

By

Published : Dec 7, 2021, 6:53 PM IST

Kishan Reddy on TRS Government: 'రూపాయికి కిలో బియ్యం పథకం రద్దు చేస్తున్నారా..?'

Kishan Reddy on TRS Government: హుజురాబాద్​ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, భాజపాపై పథకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. ధాన్యం, బియ్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రి పీయూష్ గోయల్​ చాలా వివరంగా పార్లమెంట్​లో చెప్పారని స్పష్టం చేశారు. తానూ ఈ అంశంలో అనేకసార్లు స్పందించినట్లు కిషన్​రెడ్డి చెప్పారు. మళ్లీ ఇవాళ.. మరో ప్రకటన కావాలని తెరాస ఎంపీలు కోరడం సరికాదన్నారు.

Kishan Reddy on Paddy Procurement: బాయిల్డ్ రైస్‌ విషయంలో కొంత ఇబ్బందులున్నా... రా రైస్‌ కొనబోమని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదంటే రూపాయికి కిలో బియ్యం రద్దు చేయడమేనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది బియ్యం సేకరణ వదిలేసి వచ్చే ఏడాది గురించి తెరాస సర్కార్‌ మాట్లాడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రమే ఖర్చు చేస్తుందన్న కిషన్‌ రెడ్డి.. రైస్ మిల్లర్ల యంత్రాలు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయదా అని ప్రశ్నించారు.

రాష్ట్రం ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్​ చేశారు. రాష్ట్రం 17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రబీలో లక్ష్యంపై ఫిబ్రవరిలో రాష్ట్రాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ఇతర విత్తనాలు ఇవ్వాలని సూచించారు.

'హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత కేంద్రంపై విషప్రచారం మొదలెట్టారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఒప్పందం తర్వాత పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తోంది. రా రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. పారాబాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం అభ్యంతరం చెప్పింది. ఒప్పందం మేరకే రా, బాయిల్డ్ రైస్ కేంద్రం కొంటుంది.'

- కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

ఇదీచూడండి: TRS MPs boycott Parliament: 'పార్లమెంట్‌ సమావేశాలు బాయ్‌కాట్ చేస్తున్నాం.. రాజీనామా అంశాన్ని ఆలోచిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.