ETV Bharat / city

కేసులు సున్నా అయ్యేవరకు అదే స్ఫూర్తి ఉండాలి: కిషన్ రెడ్డి - Case of coronavirus in india

కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తిచెందే వ్యాధని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ రాకుండా ప్రతి వ్యక్తి యుద్ధం చేయాలన్నారు. కరోనా మహమ్మారి ఇటలీని ఏవిధంగా పట్టిపీడిస్తుందో చూస్తున్నామని తెలిపారు. మనదేశంలోకి ఆలస్యంగా రావడం వల్ల ఇప్పటివరకు చాలా తక్కువ నష్టం జరిగిందని వివరించారు.

kishan reddy
kishan reddy
author img

By

Published : Mar 24, 2020, 12:12 PM IST

కరోనా యుద్ధంలో మనం విజయం సాధిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తినే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కేసులు సున్నా అయ్యేవరకు అదే స్ఫూర్తితో ఉండాలని సూచించారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించాయని... ప్రజలు రోడ్లపై పెద్దఎత్తున గుమిగూడి పోలీసులతో వాదించడం సరికాదని హితవు పలికారు. ప్రతి వ్యక్తి ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని కోరారు.

నిన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకింది. ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కరోనా సోకుతోంది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇప్పటివరకు 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోలుకున్న 37 మందిని డిశ్చార్జి చేశాం. విమానాశ్రయాల్లో 15.24 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. 436 మందిని ఇళ్లలోనే ఉంచి చికిత్స చేయిస్తున్నాం. 118 టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచాం. 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధం చేశాం. ప్రతిరోజూ 20 వేలమందిని పరీక్షించే అవకాశం ఉంది.

-కిషన్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

కేసులు సున్నా అయ్యేవరకు అదే స్ఫూర్తి ఉండాలి: కిషన్ రెడ్డి

ఇదీ చూడండి: మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.