ETV Bharat / city

ఏలూరు ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా - ఏలూరు ఘటనపై కిషన్​రెడ్డి స్పందన

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటనపై కేంద్రం ఆరా తీసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా సిద్ధమని తెలిపారు.

eluru incident
eluru incident
author img

By

Published : Dec 6, 2020, 10:47 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతు చిక్కని సమస్యతో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.

మరోవైపు గవర్నర్‌ కార్యాలయంతోనూ కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. గవర్నర్ నుంచి నివేదిక వచ్చాక ఘటనపై స్పందించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.