కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష ఖరారు చేయనుంది. సెరికల్చర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని గతంలో పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోవటం వల్ల కోర్టు ధిక్కరణ కింద్ర న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఇవాళ కోర్టుకు రానందున పూనం మాలకొండయ్యకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని ఏపీ న్యాయస్థానం పేర్కొంది. ఈ నెల 29 న కోర్టుకు హాజరుకావాలని పూనం మాలకొండయ్యను ఆదేశించింది.
ఇదీ చూడండి: