హైదరాబాద్ విద్యానగర్‌లోని ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం హైకోర్టులో సమ్మెపై వినిపించాల్సిన వాదనలు, విశ్రాంత న్యాయమార్తుల ఆధ్వర్యంలో కమిటీ వేస్తే తదనంతరం అనుసరించాల్సి వ్యూహాలపై చర్చలు జరుపనున్నారు. సమ్మె విరమణపై పునరాలోచన వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి సత్యవతి వాహనాన్ని అడ్డగించిన ఆర్టీసీ కార్మికులు