ETV Bharat / city

మేయర్ పీఠమే లక్ష్యంగా కేటీఆర్​ ప్రచారం.. నేటి నుంచి రోడ్​ షోలు - జీహెచ్​ఎంసీలో కేటీఆర్​ రోడ్​షోలు

మరోసారి బల్దియా మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార తెరాస... ప్రచార వ్యూహాలు సిద్ధం చేసింది. గ్రేటర్‌ ఎన్నికలకు సారథ్యం వహిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ నేడు ప్రచార రంగంలోకి దిగనున్నారు. రోడ్‌షోలతో నగరమంతా మెరుపు ప్రచారం చేసి మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మేయర్ పీఠమే లక్ష్యంగా కేటీఆర్​ ప్రచారం.. నేటి నుంచి రోడ్​ షోలు

author img

By

Published : Nov 21, 2020, 4:47 AM IST

Updated : Nov 21, 2020, 7:07 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తెరాస ప్రచారం నేటి నుంచి ముమ్మరం కానుంది. డివిజన్ ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నారు. నామినేషన్లు దాఖలు ముగియడంతో.. ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేశారు. నేటి నుంచి కేటీఆర్​ నగరంలో విస్తృత పర్యటనకోసం ప్రత్యేక ప్రచార రథాలను తీర్చిదిద్దారు. ఒక్కో నియోజకవర్గంలో 2చోట్ల ప్రసంగించాలని భావిస్తున్నారు.

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ల నుంచి మంత్రి ప్రచారం ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి ఓల్డ్‌అల్లాపూర్ చౌరస్తా... 6 గంటలకు మూసాపేటలోని చిత్తారమ్మ తల్లి చౌరస్తాలో ప్రచారం చేయనున్నారు. తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉండగా.. 4 డివిజన్లకు ఒక చోట కేటీఆర్​ సభ ఉండేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7గంటలకు ఐడీపీఎస్​ చౌరస్తా, 8 గంటలకు సాగర్ హోటల్ జంక్షన్ వద్ద సభలు నిర్వహిస్తారు. ఈ నెల 29న ప్రచారం ముగిసే వరకూ ఇదే విధంగా రోడ్ షోలు నిర్వహించనున్నారు.

ఈనెల 28న సీఎం ప్రచారం

తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 28న ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ఈ సభకు జీహెచ్​ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి జనాలను సమీకరించేందకు పార్టీ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఆరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రచారం కొనసాగనుంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టాలని కేటీఆర్​ దిశా నిర్దేశం చేశారు. డివిజన్ ఇంఛార్జిలు స్థానికంగా పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రగతి నివేదికలు, పార్టీ జెండాలు, ఇతర ప్రచార సామాగ్రిని ఇప్పటికే అభ్యర్థులకు చేరవేసి ఏర్పాట్లను పూర్తిచేశారు.

ఇదీ చూడండి: 'తెరాస చేసిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేయండి'

Last Updated : Nov 21, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.