ETV Bharat / city

'అబద్ధాలు చెప్పి ప్రజలను భ్రమపెట్టేది భాజపా ఎంపీలే'

author img

By

Published : Sep 22, 2020, 2:46 PM IST

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు ఘాటుగా స్పందించారు. నోటికొట్టినట్లు మాట్లాడినంత మాత్రనా హీరోలు కాలేరని... అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేది భాజపా ఎంపీలేనని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు వచ్చి నిజానిజాలు ప్రజలకు వివరించాలని ఎంపీ అర్వింద్​కు సవాల్​ విసిరారు.

trs mps fire in bjp mp dharmapuri arvindh
trs mps fire in bjp mp dharmapuri arvindh
'అబద్ధాలు చెప్పి ప్రజలను భ్రమపెట్టేది భాజపా ఎంపీలే'

సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు స్పందించారు. లోక్​సభ సభ్యుని స్థానంలో ఉండి... రాష్ట్ర ముఖ్యమంత్రి, మున్సిపల్​ శాఖ మంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని ఎంపీలు తెలిపారు. అబద్ధాలు మాట్లాడేది తాము కాదని... భాజపా ఎంపీలు, మంత్రులేనని ఎంపీ వెంకటేశ్​ నేత ఆరోపించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు కేవలం రూ.290 కోట్లని తెలిపినట్లు గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన హీరోలు కాలేరని... వాస్తవాలు తెలపాలని హితవు పలికారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై లోక్​సభలో తమతో కలిసి గళం కలిపితే... ఓట్లేసిన ప్రజలు ఆనందపడతారని భాజపా ఎంపీలకు చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి:కేటీఆర్​ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.