ETV Bharat / city

ఆచితూచి తెరాస అభ్యర్థుల ఎంపిక.. ఆశావహుల్లో ఉత్కంఠ - జీహెచ్​ఎంసీ ఎన్నికలు-2020

జీహెచ్ఎంసీ అభ్యర్థుల తెరాస రెండో జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో ఎక్కువ మంది సిట్టింగులకే అవకాశం ఇచ్చిన గులాబీ పార్టీ... మిగతా 45 డివిజన్లపై ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్న చోట... వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. నేడు మరో జాబితా ప్రకటించే అవకాశం ఉంది.

trs leaders waiting for ghmc election candidates list
ఆచితూచి తెరాస అభ్యర్థుల ఎంపిక.. ఆశావహుల్లో ఉత్కంఠ
author img

By

Published : Nov 19, 2020, 5:17 AM IST

జీహెచ్ఎంసీ అభ్యర్థుల ఖరారులో తెరాస ఆచితూచి అడుగులు వేస్తోంది. మొదటి జాబితాలో ఎక్కువగా సిట్టింగులకే టిక్కెట్లు ఇచ్చిన గులాబీ పార్టీ... పోటీ తీవ్రంగా ఉన్న చోట వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మిగతా డివిజన్లలో తెరాస టిక్కెట్ దక్కని వారికి ఇతర పార్టీలు గాలం వేసే అవకాశాలున్నట్టు భావిస్తున్న నాయకత్వం... చివరి వరకు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 105 స్థానాలకు నిన్న రాత్రి తెరాస అభ్యర్థులను ప్రకటించింది. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఆరు కలిసొచ్చేలా 105 పేర్లతో తొలి జాబితా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిన్నటి జాబితాలో 44 స్థానాలు ఎంఐఎం సిట్టింగ్ స్థానాలే. ఆయా స్థానాల్లో తెరాస కేవలం స్నేహపూర్వకంగానే పోటీ చేస్తోంది.

దాదాపుగా సిట్టింగ్​లకే..

మిగతా 101 స్థానాల్లో అత్యధికంగా సిట్టింగ్ కార్పొరేటర్లకే మళ్లీ అవకాశం ఇచ్చింది. ఆర్​సీ పురం, సోమాజిగూడ, మియాపూర్, సుభాష్​నగర్ లో మాత్రమే కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్ ఇటీవల మరణించినందున... ఆ స్థానంలో ఉప్పలపాటి శ్రీకాంత్​కు అవకాశం కల్పించారు. ఆర్​సీ పురంలో సిట్టింగ్ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్​ను పక్కన పెట్టి పుష్ నగేష్ యాదవ్​కు టికెట్ కేటాయించింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ అవకాశం లభించింది. సోమాజిగూడలో ఆకుల విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థితుల కారణంగా... అక్కడ వనం సంగీత యాదవ్​ను బరిలో నిలిపింది. మిగతా ప్రాంతాల్లో సిట్టింగ్​లు అందరికీ అవకాశాలు లభించాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బోరబండ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.

ఇవాళ అన్నింటికీ ఖరారు..!

తెరాస తదుపరి జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాప్రా మినహా మిగతా డివిజన్లకు టిక్కెట్లు కేటాయించలేదు. ప్రస్తుతం మేయర్ బొంతు రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి అభ్యర్థి పేరు తొలి జాబితాలో లేదు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బొంతు రామ్మోహన్​ను బరిలో దించాలని తెరాస భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే చర్లపల్లి డివిజన్ నుంచి ఆయన భార్య బొంతు శ్రీదేవి యాదవ్​కు అవకాశం ఇవ్వాలని రామ్మోహన్ కోరుతున్నారు. హబ్సిగూడ డివిజన్​లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య బేతి స్వప్న పేరు తొలి జాబితాలో లేదు. అంబర్​పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భార్య పద్మ ప్రాతినిధ్యం వహిస్తున్న గోల్నాకతోపాటు... అన్ని డివిజన్లు పెండింగ్​లోనే ఉన్నాయ. రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్నందున... ఇవాళ దాదాపు అన్ని స్థానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన తెరాస

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.