ETV Bharat / city

మన్యం ప్రజలకు తప్పని తిప్పలు... వైద్యం కోసం డోలీ మోత! - vishaka tribal struggles update

వైద్యం అవసరమైన వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు.. అంబులెన్స్ ఇంటికి వచ్చి నేరుగా ఆసుపత్రికి తీసుకువెళ్తుందనేది ప్రచారమే తప్ప ఆ ఛాయలు... ఏపీలోని విశాఖ ఏజెన్సీలో మాత్రం మచ్చుకైనా కనిపించటం లేదు. ఏ గిరిజనుడైనా అనారోగ్యం పాలైతే వారికి డోలీనే దిక్కవుతుంది.

మన్యం ప్రజలకు తప్పని తిప్పలు... వైద్యం కోసం డోలీ మోత!

author img

By

Published : Jan 14, 2021, 2:29 PM IST

విశాఖపట్నం జిల్లా జి. మాడుగల మండలం మెండికోట గ్రామానికి చెందిన వంతల రాజు అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సరైన మార్గం లేక.. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్బగరువుకు డోలీలో తీసుకొచ్చి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ప్రధాన రహదారులకు మారుమూల గ్రామాలు అనుసంధానం చేయకపోటంతోనే.. తమకు డోలీ మోతలు తప్పటం లేదని గ్రామ వాలంటీర్ చిన్నారావు వాపోయారు.

పాడేరులో..

పాడేరు మండలం మారుమూల సలుగు పంచాయతీ దబ్బగరువులో అప్పారావు అనే గిరిజనుడు చెట్టుపై నుంచి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సరైన మార్గం లేకపోవటంతో.. 5 కిలోమీటర్లు డోలీలో మోసుకొని, ప్రధాన మార్గానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాధితుడు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాలకులు మారినా.. తమ తలరాతలు మారటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.