ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆహ్లాద కార్యక్రమాలు ఆకాశన్నంటాయి. కరోనా విపత్తు తర్వాత ఫిల్మ్‌సిటీకి వచ్చిన పర్యాటకులు అద్భుత ప్రపంచంలో మునిగితేలారు. మైమరపించే కార్యక్రమాలను చూసి మంత్రముగ్దులైయ్యారు. ఫిల్మ్‌సిటీ అద్భుతాలను, అందాలను కేరింతలు కొడుతూ ఆస్వాదించారు.
ఆనంద లోకాల్లో..
మధురానుభూతులను పంచే కార్యక్రమాలను వీక్షించిన సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. వీనుల విందైన సంగీత కార్యక్రమాలను ఆస్వాదించారు. నృత్య బృందాలు పంచే వినోదంతో పర్యాటకులు కేరింతలు కొట్టారు. విద్యుత్ దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ ఆనందలోకాల్లో విహరించారు.
మళ్లీ రావాలనిపిస్తోంది..
ఫిల్మ్‌సిటీలోని ఎక్స్‌క్లూజీవ్ ప్లే జోన్లు చిన్నారులను విశేషంగా అలరిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీకి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని సందర్శకులు అంటున్నారు. పది, పదిహేనేళ్ల క్రితం ఫిల్మ్‌సిటీని సందర్శించినవారు.. మరోసారి వచ్చి తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎన్నోకొత్త వినోద కార్యక్రమాలు వచ్చాయని అన్నారు.
కట్టుదిట్టంగా..
పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందం అందించడంతోపాటు... వారి క్షేమమే మరింత ప్రధానమని ఫిల్మ్‌సిటీ యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కట్టుదిట్టంగా కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తోంది.
ఇవీచూడండి: