ETV Bharat / city

కరోనాకు మందు లేదు.. ఓ ఆయుధం ఉంది: కేసీఆర్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో కరోనాకి మందులు లేకపోవడం పెద్ద బలహీనతని అన్నారు.

cm kcr
cm kcr
author img

By

Published : Mar 27, 2020, 7:53 PM IST

Updated : Mar 28, 2020, 5:21 AM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ ఒక్కరోజులో 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఆస్పత్రిలో కోలుకుని ఇంటికి వెళ్లాడని చెప్పారు. రాష్ట్రంలో 20 వేల మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లేకపోతే భయంకర పరిస్థితులు వచ్చేవన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు, లాక్ డౌన్ సహా సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కరోనా నివారణకు ఏకైక ఆయుధం

ప్రపంచంలో కరోనాకి మందులు లేకపోవడం పెద్ద బలహీనతని సీఎం అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందని వివరించారు. మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని చెప్పారు. స్వయం నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు పాటించడం తప్ప గత్యంతరం లేదని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్షని పునరుద్ఘాటించారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే సమయం కాదన్నారు. అన్ని చర్యలకు ప్రభుత్వం వంద శాతం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని ప్రధాని చెప్పారని వివరించారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

వ్యాధి ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశాం. 1400 ఐసీయూ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాం. మరో 500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్‌ ఇచ్చాం. ఐసోలేషన్‌లో 11 వేల మందికి చికిత్స అందించేలా చర్యలు. ఇన్‌పేషంట్‌ కింద చేరిన వారికి 12,400 పడకలు సిద్ధం చేశాం. సుమారు 60 వేల మందికి పాజిటివ్‌ తేలినా వైద్యం చేసేలా సన్నద్ధం అవుతున్నాం. 11 వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల సేవలు వాడుకుంటాం. కరోనా కట్టడికి గ్రామాల్లో కంచెలు వేసుకోవడం మంచిదే. అంబులెన్సులు, ఇతర ఊరి అవసరాల కోసం వెసులుబాటు కల్పించాలి.

-సీఎం కేసీఆర్​

ఏప్రిల్​ 15 వరకు లాక్​డౌన్​

ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నామని కేసీఆర్‌ ప్రకటించారు. పోలీసులు, ప్రభుత్వ, వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాలని సూచించారు. ఇతర సామాజిక అవసరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అందరికీ ఆహార వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్‌కు ప్రజలు గుంపులుగా వెళ్లవద్దని కోరారు. కార్మికులకు ఆహార, వసతి సౌకర్యాలు కల్పిస్తామని... ఏ రాష్ట్రాలకు చెందిన వారినైనా ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఆ పండ్లు తినండి

విద్యార్థులు ఉండే హాస్టళ్లు ఎట్టి పరిస్థితుల్లో మూయరని సీఎం పేర్కొన్నారు. పేదలు, బిచ్చగాళ్లు, కూలీలు ఆకలితో బాధపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పౌల్ట్రీలు, డెయిరీలకు గడ్డి తరలించే వాహనాలను ఎవరూ అడ్డుకోరని తెలిపారు. చికెన్‌ తింటే వ్యాధి ప్రబలుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... చికెన్‌, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని వివరించారు. శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం విటమిన్‌ సీ పండ్లు తినాలన్నారు.

ఆందోళన వద్దు.. పంట కొంటాం

రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు పూర్తిగా బంద్‌ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దని... ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ 10 వరకు పంటలకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. మరో 15 రోజులు రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని అన్నారు. విద్యుత్‌ సరఫరాకు ట్రాన్స్‌కో, జెన్‌కో సిబ్బంది కృషిచేయాలని సూచించారు. రైతు బంధు సమితి సభ్యులు ఊరికి కథా నాయకులు కావాలని సీఎం తెలిపారు. ఎల్లుండి సాయంత్రం 5 గం.కు కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఒక్క రోజే పది మందికి కరోనా పాజిటివ్​..జాగ్రత్త సుమా..!

Last Updated : Mar 28, 2020, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.