1. చాలా తప్పు..
పార్లమెంటరీ ప్యానెల్ సమావేశాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని మీడియాకు వెల్లడించవద్దని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నివేదికను సమర్పించే ముందు సమాచారాన్ని బయటకు చేరవేయడం సభా హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ప్యానెల్ అధ్యక్షులకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కిసాన్ బ్రాండ్
కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా తయారుచేయనున్నట్లు... నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు... కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలిపారు. కేంద్రమంత్రి సదానంద గౌడతో సమీక్షించి సెప్టెంబర్ చివరి వారంలో ప్లాంట్‌ను సందర్శిస్తామని కిషన్ రెడ్డి అధికారులకు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మావి మాకివ్వండి
జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. తెలంగాణకు రావాల్సిన రూ.5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నిర్లక్ష్యంతోనే మరణాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే కరోనాతో ప్రజలు మరణిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సుప్రీం నో..
దేశవ్యాప్తంగా మొహర్రం సందర్భంగా నిర్వహించే ఊరేగింపునకు అనుమతిని నిరాకరించింది సుప్రీంకోర్టు. లఖ్‌నవూకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఫ్లాట్‌గా సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో చివరి సెషన్లో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 40, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో స్థిరపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఫినిషింగైనా చెలరేగుతా..
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు తొలిసారి ఆడనున్న రహానె.. జట్టులో తన స్థానం గురించి మాట్లాడాడు. కోచ్ పాంటింగ్‌తో కలిసి పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మాట తప్పలేదు..
కరోనా సంక్షోభ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి నటుడు సోనూసూద్ అండగా నిలుస్తున్నారు. ఆయనకు సమాచారమిస్తే చాలు సాయమందినట్టే. తాజాగా కర్ణాటకలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళకు.. ఇచ్చిన హామీని నెరవేర్చారు. రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఒంటరిగా ఏడ్చా..
నెపోటిజమ్ విషయమై తనను ట్రోల్ చేయడం చాలా బాధగా ఉందని అన్నాడు హీరో సైఫ్ అలీఖాన్. నటుడిగా తాను చీకటి రోజులు అనుభవించానని పేర్కొన్నాడు. తాను పడ్డ కష్టాలు హీరో అక్షయ్‌కుమార్‌కు తెలుసని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. గుట్టు రట్టు చేస్తా..!
మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఉచ్చులో సినీపరిశ్రమ కూడా చిక్కుకుంది. నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో తీగలాగుతుంటే మత్తు డొంక కదిలింది. రియా సహా పలువురు సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో డ్రగ్స్ గుట్టు బయటపెడతానని, తనకు వ్యక్తిగత రక్షణ కల్పించాలని కంగనా కేంద్రాన్ని అడగడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.