ETV Bharat / international

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మార్చేలా అమెరికా కీలక నిర్ణయం- ఇక పుతిన్​కు కష్టాలు తప్పవా?

రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ గతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు ఓ బైడెన్ కీలక నిర్ణయం - రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేలా ఉక్రెయిన్​కు అమెరికా అనుమతి

Biden Allows Ukraine To Use Range Missiles
Biden Allows Ukraine To Use Range Missiles (Associated Press, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Biden Allows Ukraine To Use Range Missiles : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందిస్తున్న దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూ భాగంపై దాడికి వినియోగించేందుకు కీవ్‌కు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మాస్కోపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం దొరికింది. ఉత్తర కొరియా సైన్యం సాయంతో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు రష్యా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లాంగ్​ రేంజ్​ క్షిపణులను ఉక్రెయిన్​ ఉపయోగించేలా అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా పశ్చిమ దేశాలతో పాటు జెలెన్​స్కీ కూడా బైడెన్​పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాంటి అయుధాలను వాడకుండా నిషేదం విధించడం వల్ల తమ నగరాలు, విద్యుత్​ గ్రిడ్​లపై పుతిన్ సేనలు చేసే దాడులను అడ్డుకోలేక పోతున్నట్లు బైడెన్​తో చెప్పారు.

మరోవైపు బైడెన్‌ నిర్ణయాన్ని, ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ కొనసాగిస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే ఇప్పటికే పుతిన్ సేనలను ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్​, దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాకు కొంతమేర ఇబ్బందులు కలగవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా బైడెన్ చేసిన ఈ ప్రకటనపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.