ETV Bharat / sports

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం! - కెప్టెన్ ఎవరంటే? - ROHIT SHARMA MISS PERTH TEST

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్టుకు టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం!

Border Gavaskar Trophy Rohith Sharma
Border Gavaskar Trophy Rohith Sharma (Source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 18, 2024, 7:05 AM IST

AUS vs IND Border Gavaskar Trophy : ఆస్ట్రేలియా, టీమ్ ఇండియా మధ్య మరో నాలుగు రోజుల్లో (నవంబర్ 22న) బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. ఈ సారి కూడా సిరీస్​తో ట్రోఫీ చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.

అయితే కెప్టెన్ రోహిత్‌ శర్మ తన భార్య డెలివరీ కావడంతో భారత్‌లోనే ఉండిపోయాడు. హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్దే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పితృత్వాన్ని ఆస్వాదించేందుకు అతడు మరి కొన్ని రోజులు భారత్‌లోనే ఉండబోతున్నాడట.

అందుకే మొదటి టెస్టుకు తాను అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీకి రోహిత్ శర్మ తెలియజేసినట్లు సమాచారం. కానీ దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఒకవేళ రోహిత్ శర్మ నిజంగానే అందుబాటులో లేకపోతే వైస్‌ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah Border Gavaskar Trophy) పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడని తెలిసింది. అంతకుముందు కూడా బుమ్రా ఓ సారి భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 2022లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు మందు హిట్​ మ్యాన్ కరోనా బారినపడి, పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడం వల్ల బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కాగా, అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జ‌ట్టుతో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. "మొదటి టెస్టుకు ముందే రోహిత్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని ఆశించాం. కానీ అతడు తనకు మరికొంత సమయం కావాలని, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లలేనని బీసీసీఐకి చెప్పాడు. బీసీసీఐ అతడి నిర్ణయాన్ని గౌరవించింది. రోహిత్‌ శర్మ అడిలైడ్‌లో జరిగే పింక్ బాల్ టెస్టు(రెండో టెస్టు)కు ముందు జట్టుతో కలుస్తాడు. మొదటి టెస్టుకు, రెండో టెస్టుకు మధ్య తొమ్మిది రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఆ సమయానికి హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడు" అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

షమీ ఏజ్ కాంట్రవర్సీ- వయసు 34 కాదు, 42 అంట- ఇదే ప్రూఫ్!

బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఎలా మొదలైంది- ఆ పేరెలా వచ్చింది- 28ఏళ్ల హిస్టరీ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.