ETV Bharat / spiritual

కార్తిక పురాణం వింటే చాలు - తెలిసీ, తెలియక చేసిన పాపాలు అన్నీ నశించడం ఖాయం! - KARTHIKA PURANAM

సకల పాపహరణం- కార్తిక పురాణ శ్రవణం - పదిహేడవ అధ్యాయం మీ కోసం!

Karthika Puranam Chapter 17
Karthika Puranam Chapter 17 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 5:00 AM IST

Karthika Puranam Chapter 17 : పరమ పవిత్రమైనకార్తికమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తికపురాణంలో భాగంగా వశిష్టుడు జనక మహారాజుతో దీప స్థంభం నుంచి ప్రత్యక్షమైన ధనలోభుని వృత్తాంతం గురించి అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా వివరించిన సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం.

అంగీరస ధన లోభుల సంవాదం
వశిష్ఠులవారు జనకునితో పదిహేడవ రోజు కథను చెప్పడం ప్రారంభించారు. "దీపస్తంభం నుంచి బయటకు వచ్చిన పురుషుని సందేహాలకు అంగీరసుడు "ఓ ధనలోభి! నీ సందేహాలకు సమాధానం చెబుతున్నాను. వినుము!" అంటూ చెప్పసాగెను.

కర్మ సిద్ధాంతం
మానవుడు చేయు కర్మ వల్ల ఆత్మకు దేహధారణము కలుగుచున్నది. శరీరం ఏర్పడుటకు కర్మయే కారణమగుచున్నది. శరీరం ధరించడం వల్లనే ఆత్మ కర్మను చేయును. అందుకే కర్మ చేయుటకు శరీరమే కారణ మగుచున్నది. ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు. అదే నేను మీకు వివరిస్తున్నాను.'ఆత్మ' అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నది." అని అంగీరసుడు వివరించగా అప్పుడు ధనలోభుడు "ఓ మునీశ్వరా నేను ఇంతవరకు ఈ శరీరాన్నే ఆత్మగా అనుకుంటున్నాను. నాకు "అహం బ్రహ్మ" అను పదానికి అర్ధం తెలియచేసి జ్ఞానబోధ చేయండి" అని వేడుకున్నాడు.

"అహం బ్రహ్మాస్మి"
అప్పుడు అంగీరసుడు ధనలోభునితో "ఈ దేహమే శాశ్వతమని భ్రమించడమే కాకుండా అన్నింటికీ "నేను, నాది" అని అనడమే 'అహం'. సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే 'ఆత్మ'. ఆత్మకు మరణం లేదు. ఆకలి దప్పికలు ఉండవు. నీటిలో నాని పోదు. అగ్నికి కాలదు. ఇదే శాశ్వతం. ఆత్మకు దుఃఖం ఉండదు. సుఖాన్ని అనుభవించదు. ఏ విధంగా అయితే గాజు బుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింప చేస్తుందో, అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును శరీర ఇంద్రియాల ద్వారా ప్రసరింపచేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది. ఇంద్రియాల పనితీరును నియంత్రిచేది ఆత్మ. ఎలాగైతే ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.

ఆత్మకు నాశనం లేదు
శరీరములోని ఇంద్రియాలన్నీ ఆత్మ ఆదేశంతోనే పని చేస్తాయి. 'జన్మించుట', 'పెరుగుట',' క్షీణించుట', 'నశించుట' వంటి లక్షణాలు శరీరానికే కానీ, ఆత్మకు ఉండవు. ఇటువంటి ఆత్మను కనుగొనలేక మానవుడు శరీరమే తాను అన్న భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మానవుడు మరణించిన తరువాత ఎన్ని జన్మలెత్తినా ఆత్మ మాత్రం ఒక్కటే. 'అదే జీవుడు'. ఈ జీవుడు ఒక్కో జన్మలో ఒక్కొక్క శరీరంలోనికి ప్రవేశించి తన పాపపుణ్య ఫలములను అనుభవిస్తూ ఉంటాడు.

పరమాత్మలో ఐక్యం
ఎప్పుడైతే మనుజుడు పరమ పవిత్రమైన కార్తికమాస వ్రతం, దీపారాధన, దీపదానం,కార్తికపురాణ పఠనం, పురాణం శ్రవణం చేసి ఆ హరిహరులను సంతుష్టులను చేస్తాడో అంతటితో అతని పాపరాశి ధ్వంసమై అతని జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది.

ఆత్మశుద్ధి
జీవులు కర్మఫలము అనుభవించేలా చేసేవాడు ఆ పరమేశ్వరుడు. అందువల్ల మానవుడు సద్గుణములను పెంచుకొని, గురు శుశ్రూషలు చేసి, సంసారం సంబంధమగు ఆశలన్ని విడిచిపెట్టి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన ఆత్మ శుద్ధి కలుగును. దాని వల్ల జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి, మోక్షమునకు శ్రీహరిని ఆశ్రయించాలని" అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఈ విధముగా పలికెను. అంగీరసుని ప్రబోధన గురించి మరుసటి అధ్యాయంలో తెలుసుకుందామని చెబుతూ వశిష్ఠుడు పదిహేడవ రోజు కథను ముగించాడు.

ఇతి స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే సప్తదశోధ్యాయః సమాప్తః ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.