1. ఉగ్ర కుట్ర
జమ్ము కశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు జైషే మహ్మద్, ఐఎస్ఐ ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 20న సమావేశమై దాడికి పథక రచన చేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పీవీ విదేశీ విధానంపై చర్చ
గాంధీభవన్‌లో పి.వి.నర్సింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సమావేశమైంది. ఈ నెల 30న నిర్వహించనున్న పీవీ విదేశీ విధానంపై కమిటీ చర్చించింది. జూమ్ ద్వారా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రానున్న రెండు రోజులు
రాష్ట్రంలో ఇవాళ, రేపు చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడటం వల్ల 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. చంపేశారు..
సంగారెడ్డి జిల్లా గంగారంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమెను జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు. ఆమె బతికుండగానే మరణించిందంటూ డాక్టర్ సిద్దార్ధ్ చెప్పినట్లు ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబీకులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టగా.. వారికి మద్దతుగా సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. అధృష్టవంతురాలు..
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. త్వరలోనే యాపిల్ స్టోర్
పండుగ సీజన్ నేపథ్యంలో మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు.. భారత్‌లో అధికారిక ఆన్లైన్ రిటైల్ స్టోర్ ఏర్పాటుకు యాపిల్ కసరత్తు ముమ్మరం చేసింది. దీనిపై యాపిల్ సంస్థ అధికారిక ప్రకటన చేయకున్నా.. వచ్చే నెలలోనే స్టోర్ ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. చివరకు లాభాలతోనే..
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు బలపడి లాక్డౌన్ తర్వాత తొలిసారి 39 వేల స్థాయికి చేరింది. నిఫ్టీ 77 పాయింట్లు బలపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చిన్నారులకు రైనా ప్రోత్సాహం!
కశ్మీర్‌లోని చిన్నారులను క్రికెట్ వైపు ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. ఇందుకోసం ఓ ప్రతిపాదనా లేఖను జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఎస్‌ఎస్‌పీ అనంత్‌నాగ్ సందీప్ చౌదరీకి పంపించాడు. రైనా కూడా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి రావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బీ కేర్‌ఫుల్
కరోనాపై పోరులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారిపై పోరులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బాలయ్య ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. తమన్నా ఇంట్లో కరోనా..
అగ్రనటి తమన్నా భాటియా కుటుంబం కరోనా బారిన పడింది. ఈ అందాల భామ క్షేమంగా ఉన్నప్పటికీ.. తన తల్లిదండ్రులకు మాత్రం వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.