1. కీలక భేటీ
రోజురోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుందా..? ప్రస్తుతం అమలవుతున్న రాత్రి కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చనుందా? లేకుంటే లాక్‌డౌన్ తరహా ఆంక్షలతో ఉదయం కూడా కర్ఫ్యూని అమలు చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ రేపు తెరపడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. వరుసగా రెండోరోజు.!
రాష్ట్రంలో తాజాగా మరో 4826 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు 65,923 మందికి పరీక్షలు చేయగా 4826 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సరిహద్దులో ఆంక్షలు..!
ఏపీకి చెందిన కొవిడ్ రోగి అంబులెన్స్‌ను పోలీసులు నిలిపేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పడక ఉందని చెప్పినా కూడా పంపకపోవడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్దే రాష్ట్ర పోలీసులు అంబులెన్స్‌ను నిలిపేశారు. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించిన పోలీసులు చివరికి అనుమతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రెండో డోసు కష్టాలు..
రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీ కేంద్రాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. రెండో డోస్ వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో... పంపిణీ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ప్రజల రద్దీకి సరిపడినన్ని టీకాలు అందుబాటులో లేకపోవడంతో... సిబ్బంది కొందరికే టోకెన్లు ఇచ్చి మిగతా వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'మీ జోక్యం అనవసరం'
కేంద్రం తన టీకా విధానాన్ని పూర్తిగా సమర్థించుకుంది. దీనిపై సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలపై 200 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పేర్కొంది. మరోవైపు, సుమోటో కేసుపై సుప్రీం చేపట్టిన విచారణ మే 13కు వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఓడిన ప్రధాని.!
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఓలీకి 93 ఓట్లు వచ్చాయి. సీపీఎన్ మావోయిస్ట్ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
7. కాస్తా తగ్గాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 3.66 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 3,754మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ధరలు తగ్గేది అప్పుడే.!
క్లియరెన్స్ సమస్యల కారణంగా ఓడరేవుల్లో నిలిచిపోయిన వంటనూనెలు దిగుమతి అయితే.. దేశంలో నూనెల ధరలు అదుపులోకి వస్తాయయని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వద్దంటున్న 60 శాతం మంది!
ఇప్పటికే ఏడాది వాయిదా పడ్డ ఒలింపిక్స్‌ను ఈ సారి కూడా వాయిదా లేదా రద్దు చేయడానికే జపాన్‌లోని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. అక్కడ కరోనా సెకండ్ వేవ్ విజృంభించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఎన్టీఆర్‌కు పాజిటివ్
అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబంతో సహా తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన పడొద్దని అన్నారు. గత కొద్దిరోజుల్లో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని తారక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.