- కొవిడ్ అంతం కావాలి..
హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన... ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో తమిళిసై దంపతులు పాల్గొన్నారు. గవర్నర్ దంపతులను పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. తెలంగాణ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని తమిళిసై ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం సభ ఆపాలంటూ హౌస్ మోషన్..
కరోనా విజృంభిస్తున్న వేళ నాగార్జునసాగర్ అనుములలో సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను ఆపాలంటూ కొందరు రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సాయమందించిన ఎమ్మెల్సీ కవిత..
ఎమ్మెల్సీ కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీలను అందించి వారికి చేయూతనిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు..
కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా లక్షమందితో సీఎం కేసీఆర్ హాలియాలో సమావేశం నిర్వహిస్తున్నారని సీఈసీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్తో జరిగిన దృశ్యమాధ్యమ సమీక్షలో సూర్యాపేట జిల్లా కోదడ నుంచి ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిట్ల సంస్కారం తీసుకొచ్చిందే కేసీఆర్..
సీఎంను తిడితే కేసులు పెడతామని హెచ్చరిస్తోన్న మంత్రి కేటీఆర్.. అసలు తిట్ల సంస్కారం తీసుకొచ్చిందే కేసీఆర్ అన్న విషయం మరచిపోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గుర్తు చేశారు. మరోవైపు తెరాస వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కు దక్కనివ్వకుండా.. భాజపా, అధికార పార్టీతో కలిసి నాటకం ఆడుతోందని భట్టి దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధ్యతలు స్వీకరించిన సుశీల్..
24వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఈసీ సునీల్ అరోడా పదవీ కాలం ఈ నెల 12న ముగిసింది. దీంతో రాష్ట్రపతి ఆదేశానుసారం ఆ తరువాత సీనియర్ అయిన సుశీల్ చంద్రను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నక్సల్బరిపై భాజపా జెండా!
దేశ చరిత్రలో బంగాల్ నక్సల్బరికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాటి ఉద్యమంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది నక్సల్బరి. ఆ తర్వాత ఆ ప్రాంతం నక్సల్స్ చేతిలోకి వెళ్లింది. ఆ తర్వాత రాజకీయంగా.. వామపక్షాలు ఆధిపత్యం చెలాయించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లోయలో పడ్డ కారు- ఐదుగురు దుర్మరణం..
హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టెస్టుకు సిద్ధమైన టీమ్ఇండియా..
భారత్ మహిళల ఇంగ్లాండ్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఇందులో భాగంగా టెస్టు, తలో మూడు వన్డేలు, టీ20లు ఆడనున్నాయి ఇరుజట్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇష్క్' విడుదల తేదీ ఖరారు..
తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన 'ఇష్క్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.