ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
TOP TEN NEWS @1PM
author img

By

Published : May 18, 2021, 12:59 PM IST

  • ప్రజలు పాతేస్తారు..

హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సాగర్​లో లాగా ఇక్కడ గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికలు వస్తే ప్రజలంతా అండగా ఉంటారని స్పష్టం చేశారు. హుజూరాబాద్​ ప్రజలు సహనం కోల్పోవద్దని సూచించారు. పద్ధతులు మార్చుకోకపోతే కరీంనగర్ కేంద్రంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆక్సిజన్​ సిలిండర్లు చోరీ..

ఝార్ఖండ్​లోని హజారీబాగ్​లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్​ సిలిండర్​లను చోరీ చేశారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజాప్రతినిధుల ఘర్షణ..

భూవివాదంతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రాళ్లతో పరస్పర దాడికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా చామనపల్లిలో చోటుచేసుకుంది. ఇంటి ముందు దారి విషయంలో వివాదం తలెత్తడమే ఈ గొడవకు కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ కుర్రాడికి కొవిడ్ నెగెటివ్..

కరోనా బారిన పడి.. ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల చెట్టునే ఐసోలేషన్​ గదిగా మార్చుకున్న బి.టెక్ విద్యార్థి వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కొవిడ్ నెగెటివ్ రావడం వల్ల అధికారులు ఆ యువకుణ్ని ఇంటికి తీసుకువెళ్లి.. అతని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రైతులు నష్టపోతున్నారు..

ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. అకాల వర్షాలకు అన్నదాతలు నష్టపోతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కాంగ్రెస్ సీనియర్ నేత మృతి..

కరోనా కాటుకు మరో నాయకుడు బలయ్యారు. ఐదు రోజులుగా ఉప్పల్​లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ సీనియర్ నేత టి.రాజేశ్వర్ మృతి చెందారు. ముషీరాబాద్​ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున సుధీర్ఘ కాలం పని చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాను జయించిన వందేళ్ల బామ్మ..

100 ఏళ్ల బామ్మ కరోనా వైరస్​ను జయించారు. తన కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని నింపి వారు కోలుకునేలా చేశారు. వైరస్​కు భయపడకుండా సానుకూల దృక్పథంతో ఉండాలని చెబుతోంది ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన ఈ బామ్మ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కమల సంపాదనే ఎక్కువ..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదాయం కన్నా.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దాదాపు 3రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. తాజాగా వారు వెల్లడించిన ఆదాయ పన్ను వివరాలు స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వార్నర్ బుక్ రాయాలి..

ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదంపై స్పందించాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ వివాదంపై డేవిడ్ వార్నర్ పుస్తకం రాస్తే బాగుంటుందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హీరో రామ్​ కుటుంబంలో విషాదం..

హీరో రామ్​ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయన తాత తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుపుతూ రామ్​ భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.