- ఏడుగురు సజీవదహనం..
గుజరాత్ సురేంద్రనగర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. డంపర్, కారు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత జవాను వీరమరణం..
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలు ఆగటం లేదు. తాజాగా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ..
మంత్రి కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సుమ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మొదలైన నేపథ్యంలో కేటీఆర్‌తో యాంకర్ సుమ భేటీ కావటం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం కేసీఆర్ సంతాపం..
ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు దేవీప్రియ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న దేవీప్రియ... ఈరోజు ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గడువు పొడిగింపు..
గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు బీ-ఫారమ్ సమర్పించేందుకు ఆదివారం వరకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డిపాజిట్లు కూడా దక్కవ్..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీర్‌పేట్, సనత్ నగర్ డివిజన్లలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స..
ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సి వస్తే రోగికి మత్తు తప్పనిసరి. కానీ.. మత్తు లేకుండా శస్త్రచికిత్స అంటే.. వామ్మో కష్టమే కదా అనుకుంటున్నారా? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రోగి స్పృహలో ఉండగానే.. మెదడుకు శస్త్రచికిత్స నిర్వహించిన ఏపీలోని గుంటూరు వైద్యులు.. ప్రత్యేకత చాటుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారికే మెరుగైన అవకాశాలు..
గుజరాత్లో పండిత్ దీన్‌దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు వర్చువల్‌గా హాజరయ్యారు ప్రధాని మోదీ. 45 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కీలక సూచనలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్య కుమార్ వివరణ..
ఈ ఐపీఎల్లో తనను బెంగళూరు సారథి కోహ్లీ స్లెడ్జింగ్ చేయబోయాడంటూ వచ్చిన పుకార్లపై స్పందించాడు ముంబయి బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్. ఆ సమయంలో విరాట్ ఒత్తిడితో ఉన్నాడని చెప్పాడు. మ్యాచ్ గెలిచాక తనవద్దకు వచ్చి బాగా ఆడావని మెచ్చుకున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'సుందరం'గా నాని..
తన కొత్త చిత్రం కోసం సుందరం అనే విభిన్న పాత్రలో నాని కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'అంటే సుందరానికీ' టైటిల్ కూడా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.