ETV Bharat / city

ట్రాఫిక్ నియంత్రణకు రంగంలోకి ఉన్నతాధికారులు, రద్దీ వేళలపై ప్రత్యేక దృష్టి

author img

By

Published : Oct 2, 2022, 7:12 AM IST

Updated : Oct 2, 2022, 11:16 AM IST

Hyderabad Traffic control updates: హైదరాబాద్ రహదారులపై వాహనాల రద్దీ తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు నేరుగా రోడ్లపైకి వచ్చి రద్దీని క్రమబద్దీకరించనున్నారు. ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ మొదలుకొని, హోంగార్డు వరకు రహదారులపై ఉండి వాహనాల రద్దీని తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించనున్నారు. ప్రధాన రహదారుల్లో రద్దీ వేళల్లో ఒక్కో అధికారి, ఒక్కో చోట నిలబడి వాహనాలను మళ్లించనున్నారు.

Hyderabad Traffic
Hyderabad Traffic

Hyderabad Traffic control updates: హైదరాబాద్‌లోని వాహనదారులు.. తరచూ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కు కుంటున్నారు. కొన్ని ప్రధాన మార్గాల్లో గంటలతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇక వర్షం వస్తే అంతే సంగతులు. వాహనాలు ముందుకు కదల్లేని దుస్థితి. ట్రాఫిక్ పోలీసులతో పాటు, కమిషనర్లు, మంత్రులకు ట్రాఫిక్ సమస్యపై నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. సిబ్బంది పనిచేస్తున్నా కొన్ని లోటుపాట్లు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది.

వారికి మోత తప్పదు: కూడళ్ల వద్ద వాహనదారులు స్టాప్‌లైన్ దాటి ముందుకురావడం, ఫ్రీ లెఫ్ట్‌లను బ్లాక్ చేస్తుండటం. ఆర్టీసీ ఆటో డ్రైవర్ల నిర్వాకంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. కూడళ్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆటోడ్రైవర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఆ పరిస్థితిని గమనించిన అధికారులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మాట వినకుంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ట్రాఫిక్ పోలీసుల ఉదాసీనతను గమనించిన ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగనున్నారు. ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ సహా ఇతర అధికారులు నేరుగా రహదారులపైకి తిరుగుతూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాం. పుట్​పాత్​లో ఆక్రమణలు, ఎక్కడబడితే అక్కడ పార్కింగ్, సెల్లార్​లను వాణిజ్యపరంగా వాడటం వల్ల సమస్య అధికమవుతోంది. రేపటి నుంచి చేపట్టే డ్రైవ్​లో ఈ సమస్యలు పరిష్కరిస్తాం. -రంగనాథ్, ట్రాఫిక్ సంయుక్త సీపీ

రోడ్లపైనే పార్కింగ్​తో కష్టాలు: ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవడం, వీధి వ్యాపారులు, తోపుడుబండ్లు రహదారులపైకి వస్తుండటం ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతోంది. అమీర్‌పేట్, ఎస్​ఆర్​ నగర్, కోఠి, అబిడ్స్, మియాపూర్, గుడిమల్కాపూర్, అత్తాపూర్, మొండా మార్కెట్, సికింద్రాబాద్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీధి వ్యాపారులు రహదారిపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కూరగాయలు, పళ్లు, అలంకరణ వస్తువులు విక్రయించే వాళ్లు... రహదారులపైకి చేరుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసే వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి ఉంచుతున్నారు.

ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ పేరిట చలాన్లు వేస్తున్నా... కొంతమంది వాహనదారుల్లో చలనం రావట్లేదు. అలాంటి వాహనదారులపై చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకచర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రేపటి నుంచి నుంచి జరిమానాలు అమల్లోకి రానున్నాయి. వాహనాల రద్దీతో నగరవాసులు ఇబ్బందిపడుతున్నారని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించి నిబంధనలు పక్కాగా పాటించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.