ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : Jun 4, 2022, 8:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @ 9PM

KTR Comments: మంత్రి కేటీఆర్​.. మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. పేరూరు వద్ద రూ.55 కోట్లతో ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్‌ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

  • సీబీఐ విచారణ జరిపించాలి

Bandi Sanjay Letter To Kcr: మైనర్‌ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

  • ప్రభుత్వానికి భయమెందుకు?

Bhatti on drugs: హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి భయమెందుకని భట్టి ప్రశ్నించారు.

  • 'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం

corbevax vaccine india: కార్బెవాక్స్​ కరోనా టీకా బూస్టర్​ డోసుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ తీసుకున్నప్పటికీ బూస్టర్​ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్​గా కార్బెవాక్స్​ నిలిచింది.

  • మూకుమ్మడి రాజీనామా

Odisha News: ఒడిశా మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్పీకర్​ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనుంది.

  • ఆ చట్టంపై సుప్రీంలో పిటిషన్​

NCM Act: మైనారిటీ చట్టం సెక్షన్ 2సీ చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

  • ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం

Major movie success meet: 'మేజర్‌' చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

  • ఫ్రెంచ్​ ఓపెన్​ స్వైటెక్​ సొంతం

ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ స్వైటెక్​ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్​ను ఓడించి మరోసారి టైటిల్​ను సొంతం చేసుకుంది.

  • అది ప్రభుత్వ వాహనమా?!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. అయితే అది ఎవరిది.. ఎక్కడ ఉంది అనే సందేహాలను ఇప్పటివరకు పోలీసులు నివృత్తి చేయలేకపోయారు.

  • ముగ్గురిని రిమాండ్ చేయనున్న పోలీసులు

రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్​ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆ ముగ్గురు నిందితులను ఈరోజు రిమాండ్​కి తరలించనున్నారు.

  • తప్పని నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధం

KTR Comments: మంత్రి కేటీఆర్​.. మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించారు. పేరూరు వద్ద రూ.55 కోట్లతో ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్‌ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

  • సీబీఐ విచారణ జరిపించాలి

Bandi Sanjay Letter To Kcr: మైనర్‌ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారంపై సీబీఐ విచారణ జరిపించాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

  • ప్రభుత్వానికి భయమెందుకు?

Bhatti on drugs: హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి భయమెందుకని భట్టి ప్రశ్నించారు.

  • 'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం

corbevax vaccine india: కార్బెవాక్స్​ కరోనా టీకా బూస్టర్​ డోసుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ తీసుకున్నప్పటికీ బూస్టర్​ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్​గా కార్బెవాక్స్​ నిలిచింది.

  • మూకుమ్మడి రాజీనామా

Odisha News: ఒడిశా మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్పీకర్​ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనుంది.

  • ఆ చట్టంపై సుప్రీంలో పిటిషన్​

NCM Act: మైనారిటీ చట్టం సెక్షన్ 2సీ చట్టబద్ధతను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది. జిల్లాస్థాయిలో మైనారిటీలను గుర్తించాలని మార్గదర్శకాలు జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

  • ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం

Major movie success meet: 'మేజర్‌' చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

  • ఫ్రెంచ్​ ఓపెన్​ స్వైటెక్​ సొంతం

ఫ్రెంచ్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ స్వైటెక్​ సత్తా చాటింది. అమెరికాకు చెందిన కోకోగాఫ్​ను ఓడించి మరోసారి టైటిల్​ను సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.