ETV Bharat / city

top news: టాప్ న్యూస్ @ 5pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్ న్యూస్ @ 5pm
టాప్ న్యూస్ @ 5pm
author img

By

Published : Feb 25, 2022, 4:57 PM IST

Oil Prices Increase : రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వంటనూనెలపై పడింది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరుగుతాయన్న నేపథ్యంలో ప్రజలు నూనె విక్రయ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

  • యుద్ధ విమానాల గర్జన.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్న వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.... రాజధాని కీవ్‌తో పాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు తమ పిల్లలను ఇంటికి రప్పించాలంటూ వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

  • అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు

యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. యుద్ధ వాతావరణంతో ఓ వైపు తినడానికి తిండి లేక, చేతిలో డబ్బులు లేక నానావస్థలు ఎదుర్కొంటున్నారు.

  • 16గంటలు శ్రమించినా...

Borewell Boy died: మధ్యప్రదేశ్​లో పొరపాటున బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించిన అధికారులు.. చిన్నారిని బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

  • దివ్యాంగురాలి కోసం దిగొచ్చారు!

Cerebral palsy girl in Kerala: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి.. చదువుకోవాలనే కోరికను తీర్చారు పాఠశాల సిబ్బంది. ఆమె కోసం రెండో అంతస్తులో ఉండే తరగతి గదిని గ్రౌండ్​ ఫ్లోర్​కు మార్చారు. పాఠశాలకు చిన్నారి వచ్చిన తొలి రోజును ఓ వేడుకలా నిర్వహించి చదువుకోవాలనే తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

  • దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం నేపథ్యంలోనూ దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 7 రోజుల వరుస నష్టాల అనంతరం ఎట్టకేలకు సూచీలు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 1329, నిఫ్టీ 410 పాయింట్ల మేర పెరిగాయి.

  • 'రాధేశ్యామ్' ప్రమోషన్స్.. వారిద్దరూ కలిసి..

Radhe shyam movie: దేశవ్యాప్తంగా ప్రమోషన్స్​కు 'రాధేశ్యామ్' సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలు, ప్రెస్​మీట్లతో హోరెత్తించేందుకు రెడీ అవుతోంది. మార్చి 11న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

  • ​ చానుకు గోల్డ్​ మెడల్.. కామన్‌వెల్త్‌కు అర్హత

Mirabai Chanu: స్టార్​ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను 55 కిలోల విభాగంలో కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. సింగపూర్​లో జరిగిన వెయిట్​లిఫ్టింగ్​ టోర్నీలో స్వర్ణం గెలిచి ఈ ఘనత పొందింది. ఇప్పటికే 49 కిలోల విభాగంలో కామన్​వెల్త్​కు చాను అర్హత సాధించింది.

  • ఉక్రెయిన్​కు రష్యా 'చర్చల ఆఫర్'.. కానీ...

ఉక్రెయిన్​తో చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది రష్యా. అయితే.. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితేనే తాము సంప్రదింపులు జరుపుతామని తేల్చిచెప్పారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రొవ్.

  • ఉక్రెయిన్​ హస్తగతమైనట్లేనా?

Russia attack Ukraine: ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ను రష్యా హస్తగతం చేసుకునేందుకు ముప్పేట దాడి చేస్తోంది. నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు ఉన్నట్లు ఉక్రెయిన్​ మిలిటరీ ప్రకటించింది. ఇప్పటికే కీవ్​ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి.

  • యుద్ధం ఎఫెక్ట్.. ఆయిల్​ కేంద్రాలకు క్యూ

Oil Prices Increase : రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వంటనూనెలపై పడింది. ముఖ్యంగా సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరుగుతాయన్న నేపథ్యంలో ప్రజలు నూనె విక్రయ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

  • యుద్ధ విమానాల గర్జన.. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు

యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్‌ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్న వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.... రాజధాని కీవ్‌తో పాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు తమ పిల్లలను ఇంటికి రప్పించాలంటూ వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

  • అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు

యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. యుద్ధ వాతావరణంతో ఓ వైపు తినడానికి తిండి లేక, చేతిలో డబ్బులు లేక నానావస్థలు ఎదుర్కొంటున్నారు.

  • 16గంటలు శ్రమించినా...

Borewell Boy died: మధ్యప్రదేశ్​లో పొరపాటున బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. దాదాపు 16 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించిన అధికారులు.. చిన్నారిని బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

  • దివ్యాంగురాలి కోసం దిగొచ్చారు!

Cerebral palsy girl in Kerala: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి.. చదువుకోవాలనే కోరికను తీర్చారు పాఠశాల సిబ్బంది. ఆమె కోసం రెండో అంతస్తులో ఉండే తరగతి గదిని గ్రౌండ్​ ఫ్లోర్​కు మార్చారు. పాఠశాలకు చిన్నారి వచ్చిన తొలి రోజును ఓ వేడుకలా నిర్వహించి చదువుకోవాలనే తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

  • దూసుకెళ్లిన సూచీలు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​

Stock Market Close: రష్యా- ఉక్రెయిన్​ మధ్య యుద్ధం నేపథ్యంలోనూ దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. 7 రోజుల వరుస నష్టాల అనంతరం ఎట్టకేలకు సూచీలు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్​ 1329, నిఫ్టీ 410 పాయింట్ల మేర పెరిగాయి.

  • 'రాధేశ్యామ్' ప్రమోషన్స్.. వారిద్దరూ కలిసి..

Radhe shyam movie: దేశవ్యాప్తంగా ప్రమోషన్స్​కు 'రాధేశ్యామ్' సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలు, ప్రెస్​మీట్లతో హోరెత్తించేందుకు రెడీ అవుతోంది. మార్చి 11న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

  • ​ చానుకు గోల్డ్​ మెడల్.. కామన్‌వెల్త్‌కు అర్హత

Mirabai Chanu: స్టార్​ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను 55 కిలోల విభాగంలో కామన్​వెల్త్​ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. సింగపూర్​లో జరిగిన వెయిట్​లిఫ్టింగ్​ టోర్నీలో స్వర్ణం గెలిచి ఈ ఘనత పొందింది. ఇప్పటికే 49 కిలోల విభాగంలో కామన్​వెల్త్​కు చాను అర్హత సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.