Home Decorating Tips And Ideas : ఏంటి ? సింహం, కోతి, నెమలి, పెద్ద పులి.. అన్నీ గోడ ఎక్కేశాయినకుంటున్నారా? మరి పక్షులు, జంతువులు మన జీవితంలో ఆ స్థాయిలో మమేకమయ్యాయి. ప్రేమగా వీటిని పెంచుకోవడమే కాదు, ఇంటి డెకరేషన్‌లోనూ భాగం చేస్తున్నారు ఇప్పుడు. సృజనాత్మకతను అద్దుకుని ఇలా ముద్దొచ్చే యానిమల్స్, పక్షులు డిజైన్లలో వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలోవే ఇళ్లలో ఇప్పుడు ట్రెండీగా మారిన ఈ ‘వాల్ లైట్‌లు’ కూడా. బెడ్‌రూమ్, హాల్, బాత్‌రూమ్.. ఏ గోడకు అయినా వీటిని సులభంగా తగిలించేయొచ్చు. ఈ రంగురంగుల డిమ్ బల్బులు గది అందాన్నే పూర్తిగా మార్చేస్తాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చి, మన మనసులను కట్టిపడేస్తాయి. పడుకునే ముందు ట్యూబ్‌లైట్‌కు బదులుగా ఈ డిమ్ లైట్‌లు ఆన్ చేస్తే చాలు. పక్షులన్నీ ఆకాశంలో విహరిస్తున్నట్లుగా, జంతువులు మనతో ముచ్చటిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అనుభూతిని పొందాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి.
పాతచీరతో ఇంటి అలంకరణ : ఇంట్లో కాస్త పాడైపోయినవో, చిరిగిపోయిన చీరలు చాలానే ఉంటాయి. వాటిని వృథాకాకుండా టెక్నాలజీని వినియోగించికొని కొత్త డిజైన్లలోకి మార్చుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం, మార్కెట్‌లో అనేక రకాల ఫ్యాన్సీ డిజైన్ల డోర్ మ్యాట్ల్‌ను కొంటుంటాం. దాన్ని బదులుగా ఈ సారి మీరు వినియోగించని పాత చీరలతో ఇలా అల్లేయండి. సౌకర్యంతో పాటూ ఎంతో మన్నికగానూ ఉంటాయి.
✵ వాడని రెండు మూడు రకాల సారీలను ఎంచుకుని వాటిని కర్టెన్లలా కుట్టి వేలాడదీయండి. గది లైట్ఫుల్గా కనిపిస్తుంది. అలానే కాస్త మెరుపు, ఆడంబరమైన అంచులు ఉండే సిల్క్ చీరలను ప్రత్యేక సందర్భాల్లో బ్యాక్‌డ్రాప్‌లగానూ వాడుకోవచ్చు.
✵ హాల్లో సోఫాల మీద ఉంచే దిండ్లకు ఓల్డ్ శారీస్‌తో తయారు చేసిన కవర్లను కుట్టి చూడండి. ఎంత క్లాసీ లుక్‌ని తెచ్చిపెడతాయో! డైనింగ్ టేబుల్ మీద సైతం పాత వాటిని పరిచి కొత్త అందాన్ని తెచ్చేయొచ్చు.
✵ దుమ్మూ ధూళీ, ఎండ వంటివాటి నుంచి రక్షణగా కట్టుకునే స్కార్ఫ్‌లనూ ఉపయోగించని చీరలతో కుట్టించుకోవచ్చు.
✵ మెడలో వేసుకునే జ్యూయెలరీ, చేతి గాజులను, హ్యాండ్ బ్యాగులను కూడా ప్రయత్నించి వైవిధ్యంగా కనిపించొచ్చు.
హిస్టరీ రిపీట్ : బంగారం, బట్టలు ఏం కొనాలన్నా - దుకాణమే మీ ఇంటికొస్తుంది
ఇంటికి రంగులు వేయిస్తున్నారా? - ఈ పెయింట్స్ వాడితే ఇంటికి అందం - మనకు ఆరోగ్యం!