ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 8, 2022, 5:00 PM IST

  • ఇది మోదీ కొత్త పొలిటికల్​ డ్రామా..

Talasani Comments: పార్లమెంట్​లో ఆంధ్రప్రదేశ్​ విభజనపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తీవ్రంగా ఖండించారు. సందర్భమే లేని సమయంలో విభజన అంశంపై మాట్లాడటం.. తెలంగాణ, ఏపీలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పటం.. మోదీ తెరలేపిన కొత్త రాజకీయ డ్రామా అని అభివర్ణించారు.

  • మోదీ క్షమాపణలు చెప్పాలి..

Revanth Reddy Fire on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్​లో మాట్లాడిన ప్రధానిపై ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్​ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం భాజపా నేతలు సెంటిమెంట్లను రెచ్చగొడుతుంటారని విరుచుకుపడ్డారు.

  • మూడో దశ పూర్తిగా తగ్గింది..

DH on Corona Third Wave: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. అన్ని సంస్థలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

  • సింగరేణి కార్మికుల సమ్మె నోటీస్

Singareni Strike: సింగరేణి కాలరీస్​లో సమ్మె సైరన్​ మోగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల సమ్మె నోటీసిచ్చారు. టీబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ నేతలు సమ్మె నోటీసు అందించారు. దీనిపై హైదరాబాద్​ ఆర్​ఎల్​సీ కార్యాలయంలో సింగరేణి సంఘాల నాయకులతో ప్రాంతీయ లేబర్ కమిషనర్ చర్చలు నిర్వహించారు. సమ్మె నోటీస్​పై చర్చించారు.

  • భిక్షాటన చేసే పాపపై..

Rape attempt on beggar: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకుడు ఓ చిన్నారిపై బలాత్కారానికి తెగబడ్డాడు. భిక్షాటన చేస్తున్న పాప అని కూడా చూడకుండా.. మదమెక్కిన ఆంబోతులా ఆమెను చెరపబోయాడు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డిలో జరిగింది.

  • ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ..

Meghalaya Congress News: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. ఆ పార్టీకి ఇప్పటివరకు మిగిలి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. భాజపాతో కూడిన అధికార ఎండీఏలో చేరాలని నిర్ణయించుకున్నారు.

  • ఆ కేసులో 49 మంది దోషులు..

Ahmedabad Bomb Blast Case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 49 మందిని దోషులుగా తేల్చింది గుజరాత్​లోని ప్రత్యేక కోర్టు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన కోర్టు మరో 28 మందిని నిర్దోషులుగా పేర్కొంది.

  • రోజంతా ఒడుదొడుకుల్లోనే సూచీలు..

stock market closing today: భారత స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. మంగళవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం భారీ నష్టాలు నమోదు చేశాయి. చివరకు కోలుకొని స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.

  • టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​..

Dhawan Iyer: వెస్టిండీస్​తో రెండో వన్డేకు ముందు టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్. కరోనా బారినపడిన భారత క్రికెటర్లు శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​కు కొవిడ్​ నెగెటివ్​గా తేలింది.

  • ఈ వారం రిలీజ్​ అయ్యే చిత్రాలివే..

Movies Releasing This Week: మాస్​ మహారాజా రవితేజ 'ఖిలాడీ', 'డీజే టిల్లు', 'గెహ్రాహియా' సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పలు చిత్రాలు ఈ వారమే విడుదల కానున్నాయి. అవేంటో చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.