ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 21, 2022, 2:57 PM IST

  • యాదాద్రిలో దుకాణాదారుల ఆందోళన..

Minister Indrakaran at Yadadri: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన దుకాణదారులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తేదీ సమీపిస్తుండటంతో కొండపైన మళ్లీ తమకు దుకాణాలు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు యాదాద్రి పర్యటనలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కాన్వాయ్​ను అడ్డుకుని తమ ఆవేదనను వెలిబుచ్చారు. మంత్రికి వినతిపత్రం అందజేశారు.

  • పీఆర్సీకి కేబినెట్​ ఆమోదం..

ap Cabinet meeting: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.

  • కలకలం రేపుతున్న ‘క్యాసినో’...

Gudivada Issue: ఆంధ్రప్రదేశ్​లోని గుడివాడలో క్యాసినో కాక ఉద్రిక్తంగా మారింది. నిజనిర్థరణకు వెళ్లిన తెలుగుదేశం నేతలు వెనక్కి వెళ్లాలంటూ.. వైకాపా శ్రేణులూ పోటీగా రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆరునూరైనా గుడివాడ క్యాసినో కల్చర్‌ను ప్రపంచానికి తెలియజేస్తామంటూ ముందుకెళ్లిన తెదేపా నేతలను... పోలీసులు అరెస్టు చేయగా.. బొండా ఉమ కారుపై కొందరు దాడి చేసి అద్ధాలు పగలగొట్టారు.

  • కొత్త యూపీని సృష్టిస్తాం..

UP Congress Youth Manifesto: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీలు.. జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్​. యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే కాంగ్రెస్​ను ఎన్నుకోవాలని కోరింది.

  • ప్రపంచంలోనే మోదీ నెంబర్​ వన్​..

Most Popular World Leaders 2022: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోదీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు.

  • డ్యాన్స్ చేస్తే పెళ్లాగిపోయింది..

తెల్లారితే పెళ్లి. ఇల్లు అంతా కోలాహలంగా ఉంది. వివాహం ముందు రోజు నిర్వహించే సంగీత్​లో అందరూ ఆడిపాడుతున్నారు. సడెన్​గా వరుడు చేసిన ఓ పనికి షాక్​కు గురైన వధువు వివాహం ఇష్టం లేదని సినిమాలోలా ట్విస్ట్​ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?

  • సైనికులపై ఉగ్రదాడి.. 11 మంది మృతి..

IS attack in Iraq: సైనిక స్థావరాల్లో జవాన్లు నిద్రిస్తున్న సమయంలో ఉగ్రదాడి జరిగింది. పలువురు దుండగులు లోపలకు చొరబడి కాల్పులకు తెగబడ్డట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.

  • సంపాదన మిగుల్చుకునేందుకు ట్రిక్స్​..

'మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోలేం. కానీ, మన అలవాట్లు దాన్ని నిర్ణయిస్తాయి'... ఎఫ్‌.ఎం. అలెగ్జాండర్‌ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందే. ఆర్థిక విషయాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయినప్పటికీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. దీర్ఘకాలంలో సంపద సృష్టికి అవరోధం కల్పించే అలవాట్లను గుర్తించడం, వాటిని అధిగమించడం ఇక్కడ ఎంతో కీలకం.

  • రెండో మ్యాచ్​లో గెలవాలంటే..

IND vs SA ODI: భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్​లో ఓడిన టీమ్ఇండియా ఈ వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్​లో రాహుల్​సేన విజయం సాధించాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాలని అభిప్రాయపడ్డారు సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.

  • ఆస్కార్​ రేసులో 'జైభీమ్​'..

Oscars 2022 jai bhim: ఈసారి ఆస్కార్స్ ఫీచర్​ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి రెండు సినిమాలు ఎంపికయ్యాయి. అందులో సూర్య 'జై భీమ్', మోహన్​లాల్ 'మరక్కర్' ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.