ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 17, 2022, 2:58 PM IST

  • రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ..!

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ భేటీలో... రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. ఆస్పత్రుల్లో మెరుగపరచాల్సిన మౌలిక వసతులపై చర్చ జరగనుంది. రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.

  • రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు

TS High Court : కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమన్న హైకోర్టు... ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల వివరాలు హెల్త్‌ బులెటిన్‌లో వేర్వేరుగా ఇవ్వాలని పేర్కొంది.

  • ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సహం..

KTR about electric vehicles: రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గ్రీన్‌ ఎనర్జీ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాలని అన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈ హనాల తయారీలో ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని వెల్లడించారు.

  • నారా లోకేష్​కు కరోనా..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్‌ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు ట్విట్టర్ ద్వారా లోకేశ్‌ వెల్లడించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు.

  • కొత్తల్లునికి 365 వంటకాలతో విందు..

365 variety of dishes to new son in law: మర్యాదలకు పుట్టినిళ్లు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అతిథులకు ఇచ్చే ఆతిథ్యం మరువలేనిది. సంక్రాంతి పండుగ పిండివంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. కొత్త అల్లుళ్లకు అన్ని రకాల వంటలు, మర్యాదలతో ముంచెత్తుతారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త అల్లుళ్లకు 365 రకాల వంటకాల రుచి చూపించారు.

  • పంజాబ్​ ఎన్నికలు వాయిదా..

Punjab Election postponed: పంజాబ్​ శాసనసభ ఎన్నికలను వారం పాటు వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 14కు బదులుగా... ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిర్ణయించింది. వేర్వేరు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

  • 'రిపబ్లిక్ డే'కు ఘన ఏర్పాట్లు..

Republic Day 2022: గణతంత్ర వేడుకలకు వాయుసేన భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సంబరాలు కొనసాగుతున్న వేళ.. 75 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది.

  • 'సూపర్​ మామ్​' పులి మృతి..

Super Mom Tigress: 29 పిల్లలకు జన్మనిచ్చిన 'సూపర్​మామ్'​ మరణించింది. 'సూపర్ ​మామ్'​ అంటే మనిషి కాదండోయ్​.. ఓ ఆడపులి. కేవలం ఎనిమిది ప్రసవాల్లోనే రికార్డ్ సృష్టించిన ఈ ఆడపులి వృద్ధాప్యంతో చనిపోయింది.

  • 100వ టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ నో..

Virat Kohli: టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్సీకి గుడ్​బై చెప్పి ఎందరినో షాక్​కు గురిచేశాడు కోహ్లీ. అయితే అతడికి కెప్టెన్​గా ఫేర్​వెల్​ మ్యాచ్​ ఏర్పాటు చేస్తామని బీసీసీఐ సీనియర్ అధికారి ఆఫర్​ చేసినట్లు సమాచారం. దీనిని విరాట్ తిరస్కరించాడట.

  • 'ఖిలాడి' బ్యూటీకి కరోనా..

'ఖిలాడి' బ్యూటీ డింపుల్ హయాతి కొవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఇన్​స్టాగ్రామ్​ ద్వారా వెల్లడించింది. ఈమె నటించిన తమిళ సినిమా 'సామాన్యుడు'.. రిలీజ్​కు రెడీగా ఉంది. తెలుగులో 'గద్దలకొండ గణేష్' సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి గుర్తింపు తెచ్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.