ETV Bharat / city

11AM టాప్​ న్యూస్

author img

By

Published : Aug 13, 2022, 10:58 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS

  • దేశంలో స్థిరంగా కరోనా..

భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. తాజాగా 15,815 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • నీట్‌, జేఈఈ విలీనం.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు యూజీసీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను విలీనం చేయాలని భావిస్తోంది. మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు కల్పించనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  • కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

  • కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు వ్యతిరేకంగా చౌటుప్పల్​లో పోస్టర్లు

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికల వేళ, నియోజకవర్గంలో ఉపపోరు రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచార ప్రణాళికలు, అభ్యర్థులపై కసరత్తుల్లో పార్టీలు మునిగితేలుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి, MLA పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చౌటుప్పల్‌లో రాత్రికి రాత్రే వెలిసిన గోడపత్రికలు చర్చనీయంగా మారాయి.

  • పుట్టెడు దుఃఖంలోనూ పునర్జన్మ

ఓ రోడ్డు ప్రమాదం ఆ బాలుడిని మృతువు కబళించింది. తీవ్రగాయాలు కావడంతో బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు గుర్తించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చారు.

  • వేలం వేయాలా, సాధారణ బియ్యంగా మార్చాలా

రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే వచ్చే నూకల నష్టాన్ని నిర్ధారించే అనే అంశంపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది. కేంద్రం 8లక్షల మెట్రిక్‌ టన్నులు ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంటానని చెప్పింది. మిగిలిన మరో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది.

  • తెలుగు సినిమా చూసి బలవన్మరణం.. 20 లీటర్ల పెట్రోల్ పోసుకొని..

ఓ తెలుగు సినిమా చూసి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ శివార్లలో 20 లీటర్ల పెట్రోలును పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

  • చరిత్ర సృష్టించిన తెలంగాణ రెజ్లర్​ నిఖిల్‌

కుస్తీ అంటే అతడికి ఇష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని కలగన్నాడు. సాధించలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు అతడి కలలకు బ్రేకులేశాయి. కానీ.. తన కొడుక్కి మాత్రం కాదు.

  • జుట్టు రాలిపోతుందా? ఇలా ట్రై చేసి చూడండి

జుట్టు రాలిపోవడం అనేది ఈ మధ్య అంతా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో దీనిని పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

  • బన్నీ 'శ్రీవల్లి' స్టెప్​ సీక్రెట్​ చెప్పిన అమితాబ్​.. ఏంటంటే?

'పుష్ప'లోని అల్లుఅర్జున్​ శ్రీవల్లి చెప్పు స్టెప్పు గురించి బాలీవుడ్​ బిగ్​బి అమితాబ్ బచ్చన్​ ఓ సీక్రెట్​ చెప్పారు. అదేంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.