ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ 9PM - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 9 PM IN TELANGANA
TOP NEWS AT 9 PM IN TELANGANA
author img

By

Published : Sep 21, 2022, 8:53 PM IST

  • ఖమ్మం బైక్ లిఫ్ట్‌ ఘటన.. భర్తను చంపేందుకు భార్య పక్కా ప్లాన్​..

మూడు ముడుల బంధం ముళ్ల బంధమవుతోంది. ఏడడుగుల అనుబంధం అల్లరిపాలవుతోంది. తాళిని ఎగతాళి చేస్తూ... నాతిచరామిని నవ్వులపాలు చేస్తూ... విష బంధంలో చిక్కుకుని నిండు జీవితాలు విషాదాంతంలోకి నెట్టుకుంటున్నారు. అనైతిక బంధానికి అడ్డుగా ఉన్నాడని... భర్తను అంతమొందించేందుకు ఓ భార్య రాసిన మరణశాసనం.

  • రేపటి నుంచే 'బతుకమ్మ కానుక'

బతుకమ్మ పండుగ రానే వచ్చింది. మరికొద్ది రోజుల్లో అంగరంగ వైభవంగా జరగనున్న పండుగకు రాష్ట్రం ముస్తాబవుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం అయింది.

  • 'ఏ కుంభకోణం బయటపడినా అందులో కేసీఆర్‌ కుటుంబం పాత్ర ఉంటోంది'

ఏ కుంభకోణం బయపడినా... అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి సంబంధం ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంపై కేసీఆర్‌ ఎందుకు నోరుమెదపడం లేదని బండి ప్రశ్నించారు.

  • "జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్​ పేరు కనిపించేదా"

తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్​లా ఆలోచించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్​లో వైఎస్సార్ పేరు ఎక్కడా ఉండేది కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తెలుగుజాతికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

  • కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి వేట.. గురువారమే నోటిఫికేషన్.. గెలిచే ఛాన్స్ ఆయనకే!

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దశాబ్దాల తర్వాత సోనియాగాంధీ వారసుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పీఠానికి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్యక్ష ఎన్నికల్లో రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోత్‌, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ బరిలోకి దిగుతారనే ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • 'దేశం ఎటువైపు పోతోంది?'... సుప్రీంకోర్టు ఆవేదన

విద్వేషపూరిత ప్రసంగాలపై మీడియాకు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. దేశం ఎటువైపు వెళ్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. టీవీలో జరిగే చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉందని..కానీ టీవీ యాంకర్లు అతిథికి సమయం కూడా ఇవ్వరని అభిప్రాయపడింది.

  • గేర్ మార్చిన పుతిన్.. ఉక్రెయిన్​పై పోరుకు మరో 3 లక్షల మంది!

ఉక్రెయిన్‌పై పోరాటానికి రష్యా 3 లక్షల మంది అదనపు బలగాలను సైన్యంలోకి పిలవనుంది. ఈ మేరకు రిజర్వ్‌ బలగాల సమీకరణకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ దేశాలు అణు హెచ్చరికలు చేస్తున్నాయని ఆరోపించిన పుతిన్‌.. వారి వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే తమ వద్ద ఉన్నవి అధునాతనమైనవని వ్యాఖ్యానించారు.

  • మహిళల ఆసియా కప్​ జట్టును ప్రకటించిన బీసీసీఐ

మహిళల ఆసియా కప్​ జట్టును ప్రకటించింది బీసీసీఐ. అక్టోబర్​ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్​కు 15 మందితో కూడిన జట్టును ఆల్ ఇండియా మహిళా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధానతో పాటు ఎవరెవరు ఉన్నారంటే..

  • ప్రముఖ కమెడియన్​ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు​ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. అయితే ఆగస్టు 10న గుండెనొప్పితో దిల్లీలోని ఎయిమ్స్​ ఆస్పత్రిలో చేరారు.

  • ఆస్కార్​ కోసం రంగంలోకి ఆర్​ఆర్​ఆర్​ టీమ్.. పదివేల మంది సభ్యులతో..​

ఆర్​ఆర్​ఆర్​' చిత్రానికి ఆస్కార్​ రావడం ఖాయమని ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు భావించిన నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పెద్ద షాకే ఇచ్చింది. జ్యూరీ సభ్యులు ఆస్కార్ నామినేషన్స్​కు ఆర్​ఆర్​ఆర్​ను కాదని గుజరాతీ సినిమా 'ఛెల్లో షో'ను ఎంపిక చేశారు. దీంతో 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ అందుకునే అవకాశం ముగిసినట్లేనని అందరూ నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు అవకాశం ఇంకా మిగిలి ఉందని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.