మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.
ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే శుభం కలుగుతుంది.
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరంగా ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.
శుభ సమయం. మొదలు పెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు.
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. పెద్దలను సంప్రదించాలి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.
కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
శుభఫలితాలు సొంతమవుతాయి. కీలక కొనుగోళ్ల వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మానసికంగా ధృడంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధు ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అలసటను దరిచేరనీయవద్దు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధనా శుభప్రదం.
మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.