ఏపీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 74,710 మందికి పరీక్షలు చేయగా... 8,096 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,09,558కి చేరింది. కొవిడ్ బీభత్సానికి మరో 67 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 5,244కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకూ 5,19, 891 మంది కోలుకోగా.. ప్రస్తుతం 84,423 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకూ 49.59 లక్షల పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల్లో వారీగా కేసులు
గోదావరి జిల్లాల్లో మరోసారి 1,000కి పైగా కేసులు వెలుగుచూశాయి. తూర్పులో అత్యధికంగా 1405, పశ్చిమ గోదావరిలో 1035, చిత్తూరులో 902, ప్రకాశంలో 713, గుంటూరులో 513, శ్రీకాకుళంలో 496, కృష్ణా 487, విజయనగరం 487, నెల్లూరులో 468, అనంతపురంలో 463, కడపలో 419, విశాఖలో 371, కర్నూలులో 337 మందికి కరోనా సోకింది.
జిల్లాల వారీగా మృతుల సంఖ్య
కడప జిల్లాలో 8, చిత్తూరు7, కృష్ణా7,తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖ జిల్లాల్లో 6, అనంతపురం 5 , నెల్లూరు 5, శ్రీకాకుళం 5 , పశ్చిమగోదావరిలో 4, ప్రకాశం 3 , విజయనగరం 3, కర్నూలు జిల్లాలో 2 మరణించారు.
ఇదీచదవండి