సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదయ్యపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో సర్పంచ్‌లను నామినేషన్ దాఖలు చేసేందుకు తీసుకు వెళ్లినందుకే టార్గెట్ చేశారన్నారు. ఇది బంగారు తెలంగాణనా.. నిర్బంధాల తెలంగాణనా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీశారు.
- ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెను ప్రజల్లోకి తీసుకెళ్లండి: లక్ష్మణ్