ఏపీలోని తిరుపతిలో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీలు.. ఇంకా వరద ముంపులోనే(Floods continue in Tirupati) ఉన్నాయి. నగర సమీపంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద నీరు రావడంతో.. సరస్వతినగర్, గాయత్రీనగర్, శ్రీకృష్ణనగర్, ఉల్లిపట్టెడలో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది.
కాలనీల్లో పేరుకుపోయిన మట్టి
పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన ఆటోనగర్, సంజయ్‌గాంధీ కాలనీల్లో వరద మట్టి పెద్దఎత్తున పేరుకుపోయింది. దుర్గానగర్, యశోదనగర్, మధురానగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు(Tirupati still in the grip of flood waters) పడుతున్నారు. తిరుపతిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
రాయల చెరువుకు పొంచి ఉన్న ముప్పు
రాయలచెరువుకు గండిముప్పు పొంచిఉండటంతో పరిసర 19 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు తితిదే పద్మావతి వసతిగృహం, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పునరావాసం కల్పించారు. రాయలచెరువు సమీపంలో ముంపు పరిస్థితిని ఆదివారం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఏపీలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు(rains in ap) చిగురుటాకులా వణికిపోతున్నాయి. తిరుపతి, తిరుమలలో కురిసిన వర్షాలకు పట్టణం వరదనీటిలో(floods in ap) మునిగిపోయింది. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టినా కూాడా ప్రజలు ఇంకా వరదనీటిలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. పలు జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కడప జిల్లాలో కమలాపురం ప్రధాన రహదారి వంతెన కుంగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో చెయ్యేరునదిలో కార్తీక పూజలకు వెళ్లిన 24 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన కడపలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రభుత్వం సహాయ చర్యలు
వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ఎమ్మెల్యేలు రావొద్దని సీఎం జగన్ సూచించారు. ఇళ్లలోకి నీరు చేరిన వరద బాధితులందరికీ నిత్యావసరాలు, రూ.2 వేల నగదు సాయం తక్షణమే అందించాలని ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చదవండి.