Vaikuntha Dwara Darshanam at tirumala: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 13 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వైకుంఠద్వార దర్శనంలో సామాన్య భక్తులకు ఎక్కువ సమయం దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అందువల్ల పది రోజుల పాటు సిఫార్సు లేఖలు తీసుకోబోమన్నారు. ప్రముఖులు స్వయంగా వస్తేనే టిక్కెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. మరమ్మతులు జరుగుతున్నందున తిరుమలలో గదుల కొరత ఉందని.. ప్రజాప్రతినిధులకు నందకం, వకుళామాత వసతి సముదాయాల్లో గదులు కేటాయిస్తామన్నారు.
గదులు సరిపోకపోతే తిరుపతిలో వసతి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు పొందిన భక్తులు తిరుపతిలోని తితిదే వసతి సముదాయాల్లోనే గదులు పొందాలన్నారు.
"వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోం. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు. వీఐపీలకు నందకం, వకుళామాత వసతి భవనంలో గదులు ఉంటాయి. గదులు సరిపోకపోతే తిరుపతిలో వసతి ఏర్పాటు చేసుకోవాలి. మరమ్మతుల వల్ల తిరుమలలో గదుల కొరత ఏర్పడింది. శ్రీవాణి ట్రస్టు టిక్కెట్లు ఉన్నవారు తిరుపతిలో గదులు తీసుకోవాలి" - వైవీ సుబ్బారెడ్డి , తితిదే ఛైర్మన్
ఇదీ చదవండి: