ETV Bharat / city

'శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ'

author img

By

Published : Oct 15, 2020, 6:41 AM IST

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు.... నేటి సాయంత్రం అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. అధికమాసం కారణంగా... ఈ ఏడాది రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలకు ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఉత్సవాలలో ఆరో రోజున స్వామి వారికి ప్రత్యేకంగా పుష్పకవిమాన సేవ నిర్వహిస్తారు.

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సిద్ధమయ్యాయి. అధికమాసం కావడంతో తిరుమలేశునికి ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. గత నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించిన తితిదే.. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ చేయనుంది. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఏకాంతంగానే...

తిరువీధుల్లో భక్తుల మధ్య వేడుకలు నిర్వహించాలని తొలుత నిర్ణయించిన తిరుమల తిరుపతి దేవస్థానం... అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. కానీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెలువడించిన కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఆలయంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో 200 మందికి మించి పాల్గొనకూడదన్న మార్గదర్శకాల మేరకు తితిదే తాజా నిర్ణయం తీసుకుంది. గత నెలలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల మాదిరిగానే నవరాత్రి ఉత్సవాలను సైతం ఆలయంలోనే ఏకాంతంగా జరపనున్నారు.

రేపు ఉత్సవాలు ప్రారంభం...

నవరాత్రి ఉత్సవాలకు ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మ‌ధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి విష్వక్సేనుల వారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేసి.. ఆస్థానం, ఇతర వైదిక కార్యక్రమాలు చేప‌డ‌తారు. రేపు రాత్రి నిర్వహించే పెద్దశేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో.. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహన సేవలను నిర్వహిస్తారు. సంపంగి ప్రాకారంలోని కల్యాణ మండపంలో వాహన సేవలను కొలువుదీర్చి... వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా 21వ తేదీ సాయంత్రం పుష్పకవిమానంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. రథోత్సవం స్థానంలో సర్వభూపాల వాహన సేవను నిర్వహించనున్నారు. 24న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

టికెట్లు ఉంటేనే తిరుమలకు..

బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించి... ఇప్పటికే 16వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా తితిదే విక్రయించింది. దర్శన టిక్కెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించింది.

ఇదీ చదవండి:

విపత్కర పరిస్థితుల్లో.. ఊహించుకొని జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.