ETV Bharat / city

బ్రేకప్ బాధను మరిచిపోయేందుకు సూపర్ చిట్కాలు - బ్రేకప్ బాధ తగ్గేందుకు చిట్కా

Breakup Pain మీ బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యిందా, మీ భార్యతో విడాకులయ్యాయా, కారణాలేవైనా ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు కలిగే బాధ అంతా ఇంతా కాదు. అన్నిరోజులు కలిసి ఉండి.. అకస్మాత్తుగా విడిపోయేటప్పుడు ఏదో తెలియని ఒంటరితనం వేధిస్తుంది. బ్రేకప్ ఆ రెండు మనసులను కుంగదీస్తుంది. మరి బాధాకరమైన బ్రేకప్ నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే ఏం చేయాలి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవేయండి.

Breakup Pain
Breakup Pain
author img

By

Published : Aug 20, 2022, 10:58 AM IST

Breakup Pain : ప్రేమికులు లేదా దంపతుల అభిప్రాయాల్లో తేడా వచ్చినప్పుడు అయ్యే బ్రేకప్‌ ఆ ఇద్దరి మనసులను కుంగదీస్తుంది. దీన్నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని ఎలా ప్రారంభించాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.

వ్యక్తిగతంగా.. బంధంలో ఉన్నప్పుడు ఎదుటివారి కోసం తమను తాము మార్చుకుంటూ, సర్దుకుంటూ వెళుతుంటారు. బ్రేకప్‌ అయినప్పుడు తమ కోసం తాము తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాలి. వ్యక్తిగత పనులకు ప్రాముఖ్యతనిచ్చుకోవాలి. మనసులో కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి సొంతంగా తమకుతాము సాయం చేసుకోవాలి. ఖాళీగా ఉండకుండా బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. విడిపోయిన వ్యక్తితో అన్నిరకాల బంధాలను దూరంగా ఉంచాలి. వారిని సోషల్‌మీడియాలోనూ అన్‌ఫాలో అవ్వాలి.

ఇతరులతో.. ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యులు, స్నేహితులు, పెద్దవాళ్ల చేయూత తీసుకోవాలి. అలాకాకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడితే క్రమేపీ కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మనసులో ఆందోళనను స్నేహితులు లేదా శ్రేయోభిలాషులతో పంచుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది. వారందించే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తే విడిపోయిన భావన నుంచి బయటపడొచ్చు.

ఆరోగ్యం.. పోషకవిలువలున్న ఆహారం, కంటి నిండా నిద్ర వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎంతటి సమస్యనైనా తట్టుకోగలిగి, ఆలోచించగలిగే సామర్థ్యాన్ని మెదడుకిస్తాయి. మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మనసుకు నచ్చిన చిత్రలేఖనం, పుస్తకపఠనం, నృత్యం, పుస్తకరచన వంటి అభిరుచులను బయటికి తీయాలి. ఏది సంతోషాన్నిస్తుందో గుర్తించి అందులో నైపుణ్యాలను పెంచుకోవాలి. దీంతో ఒంటరిననే భావం నుంచి బయటపడొచ్చు.

నిపుణులతో.. మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోతే నిపుణులను ఆశ్రయించడం మంచిది. వారి సలహాలు, సూచనలను పాటిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. మనసుకు నచ్చని బంధాన్ని కష్టంగా కొనసాగించడం కన్నా, దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచన మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. తీసుకున్న నిర్ణయం సరైనదనే నమ్మకం మీపై మీకు ముందుగా రావాలి. అప్పుడే జీవితంలో మరో అడుగు ధైర్యంగా ముందుకు వేయగలరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.