ETV Bharat / city

అఫ్గానిస్థాన్​ : తాలిబన్ల చెరలో ప్రముఖ మతపెద్ద​

అఫ్గాన్‌ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు. మొహమ్మద్ మౌల్వీ సర్దార్ జద్రాన్ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు.

taliban arrest Maulvi Mohammad Sardar Zadran

author img

By

Published : Aug 30, 2021, 6:11 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు తాలిబన్లు. అఫ్గాన్‌ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు. మొహమ్మద్ మౌల్వీ సర్దార్ జద్రాన్ కళ్లకు గంతలు కట్టి ఉన్న ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు.

ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన తాలిబన్లు.. దేశంపై నియంత్రణ సాధించిన తరువాత పలువురు మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి మహిళా గవర్నర్​గా ఎన్నికైన సలీమా మజారీని సైతం అదుపులోకి తీసుకున్నారు. చాలా మంది అఫ్గానిస్థాన్ రాజకీయ నాయకులు దేశం విడిచి వెళ్లినా.. సలీమా మజారీ బాల్ఖ్ ప్రావిన్స్ లొంగిపోయే వరకు తాలిబన్లకు ఎదురునిలిచారు. ఆమె సొంత జిల్లా చాహర్ కింట్ తాలిబాన్ వశమైంది.

కొన్నేళ్ల క్రితం అఫ్గానిస్థాన్​లో చరిత్ర సృష్టించిన ముగ్గురు మహిళా గవర్నర్‌లలో సలీమా మజారి ఒకరు. చాలా ఆఫ్ఘన్ ప్రావిన్సులు పెద్దగా ప్రతిఘటన లేకుండానే స్వాధీనమైనా.. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని చాహర్ కింట్‌ను సురక్షితంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశారు.

ఇదీ చూడండి : ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.